CORPORATOR: వరంగల్ నగరంలో భూ కబ్జా చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్ –2లో తమ పేరు మీద ఉన్న 200 గజాల స్థలాన్ని పలుమార్లు అడిగినట్లు బాధితులు తెలిపారు. …
Read More »KTR: రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడులు
KTR: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 36,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రకటనను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ–గవర్నెన్స్, హెల్త్ …
Read More »Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేత
Kamareddy Master Plan: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ నిలిపేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే బృహత్ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. బృహత్ ప్రణాళిక అంశంపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్, అదనపు కలెక్టరేట్, కమిషనర్ పాల్గొన్నారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే …
Read More »Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు
Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలు చెలరేగడానికి కారణం…విద్యుదాఘాతం కాదని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తలను విద్యుత్ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపించే సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని వెల్లడించారు. ఒక వేళ విద్యుదాఘాతమే జరిగి ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని….మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. ఘటనకు …
Read More »Fire Accident: సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రధాన రహదారి వైపు దారి మళ్లించారు. …
Read More »బెంగళూరులో వరదలు.. కేటీఆర్ కౌంటర్
బెంగళూరు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వరదల కారణంగా రూ.225 కోట్ల నష్టం వచ్చినట్లు బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్ కంపెనీస్ అసోసియేషన్ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన …
Read More »కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?
ఇటీవల పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలను మాత్రమే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె ఓ సినిమాకు సోషల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన తర్వాత అభిమానులు కాజల్ మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం తనను తప్పించిన సినిమాకు ఆమె ఆల్ …
Read More »అమిత్‌షా-ఎన్టీఆర్ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి
కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అమిత్‌షా, ఎన్టీఆర్ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్‌సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్‌షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …
Read More »తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గుడ్ న్యూస్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …
Read More »అనుకున్నదే అయింది.. కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై!
అనుకున్నదే అయింది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. త్వరలోనే తన రాజీనామా లేఖను స్పీకర్‌ను అందజేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే తనకు గౌరవముందని.. కాంగ్రెస్ పార్టీని విమర్శించనని తెలిపారు. ప్రజలు కోరుకుంటే మునుగోడు నుంచే మళ్లీ పోటీ చేస్తానన్నారు. …
Read More »