తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఈ నెల పదిహేడో తారీఖున జరగాల్సింది వాయిదా పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి టీచర్స్,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మరో కొత్త తారీఖును తెలియజేస్తామని తెలిపింది.
Read More »త్వరలోనే నూతన సచివాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సరికొత్తగా నిర్మిస్తున్న ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే.150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, …
Read More »సంక్రాంతికి కొత్త సచివాలయం..!
రాష్ర్టంలో కొత్త సచివాలయం బిల్డింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రానున్న సంక్రాంతికి కొత్త సచివాలయాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కీలకమైన భారీ డోమ్‌ల నిర్మాణం, బిల్డింగ్ లోపల ఫినిషింగ్ పనులు, చుట్టూ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, పచ్చికబయళ్ల పనులు మాత్రమే చేయాల్సి ఉంది. రాజస్థాన్ ధోల్పూర్ నుంచి తెప్పించిన ఎర్ర రాయితో కొత్త సచివాలయం బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం దీనిలో …
Read More »