తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుభాకాంక్షలు, తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తనకు 30 ఏండ్లుగా తెలుసని, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు …
Read More »శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Read More »తెలంగాణ మండలి చైర్మన్ ఎవరు..?
తెలంగాణలో ఎమ్మెల్సీల అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది. ఇక, పలువురు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్.. శాసనమండలి చైర్మన్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పదవి సీనియర్లయిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి, కడియం శ్రీహరిలో ఒకరికి దక్కవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక కూడా పూర్తయిన తరువాత మండలి చైర్మన్ ఎన్నిక ఉండనుంది.
Read More »