తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుభాకాంక్షలు, తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తనకు 30 ఏండ్లుగా తెలుసని, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు …
Read More »శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Read More »మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో 2004లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. జహీరాబాద్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2016లో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.
Read More »తెలంగాణ మండలి చైర్మన్ ఎవరు..?
తెలంగాణలో ఎమ్మెల్సీల అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది. ఇక, పలువురు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్.. శాసనమండలి చైర్మన్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పదవి సీనియర్లయిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి, కడియం శ్రీహరిలో ఒకరికి దక్కవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక కూడా పూర్తయిన తరువాత మండలి చైర్మన్ ఎన్నిక ఉండనుంది.
Read More »తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. అలాగే కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి. వీటన్నింటికీ కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలవనుంది. అలాగే ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ …
Read More »శాసన మండలి కొత్త చైర్మన్‌గా సిరికొండ మధుసూదనా చారి..?
శాసన మండలి కొత్త చైర్మన్‌గా పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధుసూదనాచారికి ఒక బెర్త్ కేటాయించడంతో పాటు, కీలకమైన మండలి చైర్మన్ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఇప్పటికే విడుదలైన …
Read More »పట్టభద్రులందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు.తనకు సహకరించిన మిత్రులకు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసి దీవించిన పట్టభద్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టభద్రులందరూ ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగపూర్‌తో పాటు పుణె, ఔరంగాబాద్‌లో కూడా బీజేపీ అభ్యర్థులను …
Read More »