కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలకు దిగారు. గత 8 ఏళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ED, IT & CBI దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంటే సత్య హరిశ్చంద్రుని బంధువులంతా బీజేపీకి చెందినవారేనా? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Read More »పారిస్ లో మంత్రి కేటీఆర్ Busy Busy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్ ఎగువ సభలో (సెనేట్) జరిగే ‘యాంబిషన్ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్-డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్ ఎరా (కొవిడ్ తర్వాత భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …
Read More »తాగునీటి సమస్యను 95% పరిష్కరించాం : మంత్రి KTR
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ మిషన్ భగీరథపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అర్బన్ మిషన్ భగీరథ పతకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు తాగునీరు అందిస్తున్నాము. రూ. 313 కోట్ల 26 లక్షల వ్యయంతో నలభై ఏడున్నర ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన 12 రిజర్వాయర్లను నిర్మించి, 384 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయడం …
Read More »KBC: కేబీసీలో ప్రశ్నగా మంత్రి కేటీఆర్ ట్వీట్..
కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఎందరో హాజరయ్యారు. తాజాగా భారత మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ హాజరయ్యారు. వీరికి అమితాబ్.. కేటీఆర్ గతంలో చేసిన ట్వీట్‌ని ప్రశ్నగా అడిగారు. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ …
Read More »పరిశ్రమల శాఖ పైన మంత్రి కేటీఆర్ సమీక్ష
పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు టి ఎస్ ఐఐసి కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జరిపిన కేటీఆర్, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పనిచేయాలని …
Read More »తెలంగాణలో ఏడేండ్లలో..15,000 పరిశ్రమలు
తెలంగాణ రాష్ట్రంలో సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండటంతో ఆర్థికాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏడేండ్లుగా పల్లెలు, పట్టణాలు సమతుల అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అనుకూల విధానాల వల్ల 15 వేల పరిశ్రమలకు పైగా రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ సమానస్థాయిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమర్థ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లనే ఇది …
Read More »కాంగ్రెస్,బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్-స్వీకరిస్తారా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ ,కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.వచ్చే నెల మార్చి పద్నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ …
Read More »లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
బాగ్‌లింగంపల్లిలోని లంబాడీ తండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు …
Read More »మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ ప్రగతిభవన్ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలిసి మొక్క అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, ఐటీ పార్క్ …
Read More »ఫియట్ రాక చాలా సంతోషకరం
ప్రపంచంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్ గడిచిన ఐదారేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలకు తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి …
Read More »