ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచన. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య …
Read More »నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడించారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ను …
Read More »తెలంగాణలో లాక్డౌన్ వల్ల సత్ఫలితాలు
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డ్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తోంది. గత 24 గంటల్లో 91 వేల కొవిడ్ పరీక్షలు చేయడం జరిగింది.. ఇందులో 3,762 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. మరో 20 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు గణనీయంగా 4.1 శాతానికి తగ్గిందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని ఆయన …
Read More »తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై క్లారిటీ
తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.
Read More »తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్
మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. నిన్న విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్ చికిత్స పొందుతున్న హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఆయా హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. తాజా అగ్ని ప్రమాదాల సంఘటన నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు/కోవిడ్ కేర్ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు …
Read More »