రాష్ట్ర రైతులకు తీపి కబురు తెలిపింది ప్రభుత్వం. డిసెంబరులో రైతు బంధు నగదును ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెండో పంట సాగుకు రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆమోదించింది. రైతుబంధు కింద సంవత్సరానికి రెండు …
Read More »రైతుల పాదాలు కడుగుతున్నాం : సీఎం కేసీఆర్
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే …
Read More »తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ భరోసా
‘వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు.. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని’ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉంది. రైతులు …
Read More »రబీలో లక్ష టన్నుల యూరియా
తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్ లో రైతన్నలకు అందించడానికి లక్షటన్నుల యూరియా సరఫరాకు క్రిబోకో అంగీకారం తెలిపింది అని మార్క్ ఫైడ్ చైర్మన్ బాపురెడ్డి తెలిపారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సహకార వాణిజ్య సదస్సుకు బాపురెడ్డి హాజరయ్యారు.ఇందులో భాగంగా క్రిబోకో చైర్మన్ చంద్రపాల్ సింగ్ ,ఎండీ సాంబశివరావును బాపురెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు రబీ సీజన్ లో లక్ష టన్నుల యూరియా సరఫరా చేయాలని …
Read More »తెలంగాణ రైతన్న మోముపై చిరునవ్వుల కళ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతాంగం గురించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రైతన్నలకు రుణాలు మాఫీ చేయడమే కాకుండా పంటపెట్టుబడి కింద రైతుబంధు పేరిట రూ పదివేలను రెండు పంటలకు కల్పి ఎకరాకు ఆర్థిక సాయం ఇస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగంటల కరెంటిచ్చిన రాష్ట్రంగా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు. …
Read More »తెలంగాణ “రైతన్న”కు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం కింద ఇవ్వాల్సిన చెక్కులను వాయిదా వేస్తూ వస్తున్న విషయం కూడా విదితమే. అయితే తాజాగా రైతుబంధు పథకానికి సర్కారు నిధులు కేటాయించింది. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని ఆర్థికశాఖకు సర్కారు ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »మార్కెట్ యార్డుల్లో రూ.5కే రైతులకు ఫుల్ మీల్స్..!!
తమ కష్టాన్ని నమ్ముకొని..దేశానికి అన్నం పెట్టె రైతన్నల కోసం ఏం చేసినా తక్కువే..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది.అయితే రైతన్న కోసం నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రూ.5తో రైతులకు భోజనం అందిస్తున్నారు.అన్నం, పప్పు, పచ్చడి, మూడు రకాల కూరలతో రైతులకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. మర్చంట్స్ అసొసియేషన్ – అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో సద్దిమూట పేరుతో …
Read More »రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తరలివెళ్తున్న 1500 మంది రైతులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 1500 మంది రైతులు, టీఆరెస్ శ్రేణులు రేపు ( 11.02.18 ఆదివారం) స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్షా 20 వేల కోట్ల వ్యయం తో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో …
Read More »సీఎం కేసీఆర్ కు జేజేలు కొడుతున్న రైతాంగం..!
అన్నదాతల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వేసిన ప్రణాళికలు విజయవంతంగా కార్యరూపం దాల్చాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో సేద్యానికి 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్ కు.. రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. అటు …
Read More »