తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి శంకర్రావు కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయారు. 2కేసుల్లో ఆయన దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపు, మహిళను దూషించారన్న కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. అంతేకాదు.. రూ.3,500 జరిమానా విధించింది. దీంతో శంకర్రావు అక్కడికక్కడే పడిపోయారు. షాద్నగర్ నమోదైన మరో కేసును కోర్టు కొట్టివేసింది.
Read More »ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకొన్న మాజీ మంత్రి ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి చెల్లని పైస గా మారిపోయింది. తనను తాను ఓ బడా నాయకుడిగా ఊహించుకొన్న ఆయన పతార ఏపాటిదో ఢిల్లీలో తేలిపోయింది. బీజేపీలో చేరడానికి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటలను ఆ పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోనేలేదు. అగ్రనేత అమిత్‌షా మా ట దేవుడెరుగు.. కనీసం ముందుగా అనుకున్న ప్ర కారం రావాల్సిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. …
Read More »MLA పదవీకి ఈటల రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో …
Read More »15రోజుల బాబు కోసం కదిలోచ్చిన యువనేత యుగంధర్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తనయుడు,యువనేత తుమ్మల యుగంధర్ తన తండ్రి బాటలోనే నడుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు ఏ సమస్యలో ఉన్న.. ఏ కష్టాల్లో ఉన్న కానీ నేనున్నానే భరోసానిస్తు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న పదిహేను రోజుల బాబును చూసేందుకు యుగంధర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లాలోని కూసుమంచి …
Read More »