గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. …
Read More »జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ నిబంధనలు విడుదల చేశారు. నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. – పోలింగ్ ఏజెంట్ అదే ప్రాంత ఓటరు కార్డు కలిగి ఉండాలి – పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి ఒక బ్యానర్ ఏర్పాటుకు అనుమతి. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో కూడిన బ్యానర్ ఏర్పాటుకు అనుమతి – బూత్‌ల ఏర్పాటు …
Read More »బీజేపీ పై బాల్క సుమన్ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించుకుపోయేందుకు ఆ పార్టీనేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడేలా సురక్షితంగా ఉన్న హైదరాబాద్‌లో విద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు గట్టు రాంచందర్‌రావు, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో …
Read More »టీబీజేపీ అధ్యక్షుడికి ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్
భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌కు హుజుర్‌నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ విసిరారు. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.. అదేమైందని బండి సంజయ్ అన్నారు. సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత.. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గం తలరాత మారిందని …
Read More »దుబ్బాకలో 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను సిబ్బంది ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. లచ్చపేటలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
Read More »4 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
తెలంగాణ శాసనసభ కీలకమైన నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చించి.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఇండియన్ స్టాంప్ బిల్లు(తెలంగాణ)2020, …
Read More »నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం ఈ రోజు మంగళవారం మొదలుకానున్నది. ఇటీవల ప్రారంభమైన శాసన సభ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. ఈ రోజు మొదలు కానున్న ఈ ప్రత్యేక సమావేశంలో జీహెచ్ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రోటేషన్ లేకుండా ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించే విధంగా బిల్లును తీసుకురానున్నది. నాలా చట్టం ,నేర విచారణ స్మృతి వంటి పలు ప్రత్యేక చట్టాలకు ప్ర్తభుత్వం పలు సవరణలను …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో పత్తి సాగు
తెలంగాణలో నియంత్రి త పంటల సాగులో భాగంగా పత్తి పంట లక్ష్యా న్ని చేరుకున్నది. బుధవారంవరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 60.03 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. నియంత్రిత సాగులో భాగంగా పత్తి పంటను 60.16 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పత్తి సాగుకావడం విశేషం. వరిసాగు 52 లక్షల ఎకరాలు దాటింది. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నట్టు వ్యవసాయశాఖ …
Read More »హరిత ప్రేమికుడు కేసీఆర్
దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్ బడ్జెట్ సీఎం దార్శనికతవల్లే ఉద్యమంలా హరితహారం రాష్ట్రంలో 29 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి హరితప్రేమికులు ప్రపంచంలోనే లేరని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బడ్జెట్‌లో 10 శాతాన్ని పచ్చదనం పెంపుకోసం కేటాయించడమే ఇందుకు నిదర్శనమని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అర్బన్ …
Read More »తెలంగాణ అసెంబ్లీ వర్షకాలం సమావేశాల కుదింపుపై చర్చించిన మండలి చైర్మన్, స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాలని నిర్ణయించారు.*
Read More »