తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి ,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సాక్షిగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ”ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత కాలం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు పార్టీకి చెందిన పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు ,ఇతర ముఖ్య నేతలు,కార్యకర్తలు మంత్రి ఈటలకు పుట్టిన …
Read More »తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 5,091 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తంగా 404 ప్రభుత్వ ,ఎయిడెడ్ కళాశాలలకు గాను 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 3,728 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. 1,497మంది గెస్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు. 150మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ …
Read More »“వర్ధన్నపేట “శ్రీమంతునికి మంత్రి కేటీఆర్ అభినందనలు
పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది… ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి గారు. ఆ మధ్య శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అతను మాత్రం తన సొంత ఆలోచనలతో సంపాదించడమే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయల చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, …
Read More »సీఏఏను వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా- కేసీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఏఏ ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా.. సీఏఏ వలన దేశం పరువు పోతుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ”సీఏఏ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడుతున్న 8వ రాష్ట్రంగా తెలంగాణ. ఈ బిల్లును వ్యతిరేకించాలని బిల్లుకు మధ్యప్రదేశ్ …
Read More »సీఏఏపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి
ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘దేశంలో 50-60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి… ద్వంద్వ వైఖరి ఎందుకు? కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా కొనసాగుతామని ప్రమాణం చేస్తాం. ముస్లింలను …
Read More »తెలంగాణ బాటలో అసోం
తెలంగాణ రాష్ట్రం బాటలో అసోం రాష్ట్రం నడిచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్, స్విమ్మింగ్‌ఫూల్స్, సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కృష్ణ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్ర, సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన పరీక్షలు మినహా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు …
Read More »అసెంబ్లీలో కవిత జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ సమక్షంలో కవిత బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కవిత కేక్‌ను కట్ చేశారు. అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో కవిత …
Read More »దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యం.
రాష్ట్రంలోని గ్రామాలను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 8 వేల 690 గ్రామ పంచాయతీలు ఉంటే వాటి సంఖ్యను 12,751కు పెంచినట్లు తెలిపారు. తండాల్లో గిరిజనులే పాలకులుగా ఉన్నారన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలను మారుస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సిఎల్పి నేత మల్లు భట్టి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగం ఆరంబించడానికి సిద్దం అయ్యారు. ఆ క్రమంలో రాజగోపాలరెడ్డి అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారు కావాలని గొడవ చేస్తున్నారని , వారు తన జవాబు వినడానికి సిద్దంగా లేరని అన్నారు. సభ్యుడిని సస్పెండ్ …
Read More »మార్చి 20వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది. రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి …
Read More »