గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రుణాలను మాఫీ చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. త్వరలోనే ఈ రుణాలను మాఫీ …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22-GHMCలో ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు
ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ బడ్జెట్‌లో రూ. 250 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 20 వేల లీటర్ల సురక్షిత మంచినీటికి ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గిందన్నారు. నగర ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22-వ్యవసాయ రంగానికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం అని పేర్కొన్నారు. రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా.. నేడు …
Read More »మార్చి 15 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం అవుతున్నారు. 2021-22 బడ్జెట్ ఏర్పాట్లు పూర్తవ్వగా.. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 18న 11:30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.
Read More »తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు సంబంధిత అంశాలపై సీఎం సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Read More »తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ బిల్లులపై చర్చ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బిల్లులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు, అభయహస్తం పథకం బిల్లుకు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. 29 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లు ఆమోదించింది. తెలంగాణ లోకాయుక్త – …
Read More »సంపద పెంచాలి… పేదలకు పంచాలి.. అనేది తమ విధానం
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2020-21ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు. తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి …
Read More »రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోన్నారు. ఇటు ఆర్థిక శాఖ తయారు చేసిన బడ్జెట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను,అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం కాపీని అందజేశారు. గవర్నర్ గా బాధ్యతలు …
Read More »శనివారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనున్నది. బడ్జెట్ పై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానాలను వివరిస్తారు.. ఈ నెల 17న పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతుంది.
Read More »