తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. లోపభూయిష్టంగా ఉన్న ప్రస్తుత చట్టం స్థానంలో సరికొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం భూ యాజమాన్య హక్కుల చట్టం-2020 (ఆర్ఓఆర్) ఈరోజు అసెంబ్లీ ముందుకు రానున్నది. పరిపాలనతో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. అనేక చట్టాలు, క్లిష్టమైన నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను …
Read More »పీవీని అవమానించిన కాంగ్రెస్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టుక నుంచి మరణించే వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కానీ, పీవీ మరణానంతర పరిణామాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మరణిస్తే.. పార్థివదేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకికూడా తీసుకెళ్లలేదని, తెలంగాణ బిడ్డ కావడం వల్లే ఆనాడు పీవీని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు …
Read More »కలం వీరుడు రామలింగారెడ్డి: మంత్రి కేటీఆర్
ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని మంత్రి కేటీఆర్ అన్నారు. కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతునిచ్చిన వ్యక్తి రామలింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రామలింగారెడ్డిది గొప్ప వ్యక్తిత్వమని, నిరాడంబరమైన జీవన విధానంతో ఉండేవారని చెప్పారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జరిగిన ఎన్నికల సందర్భంగా దొమ్మాట నియోజకవర్గానికి రామలింగారెడ్డి …
Read More »అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళులర్పించింది. వారి సేవలను సభ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సభ్యులతో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధరించారు. కరోనా …
Read More »ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం
భారతరత్న, మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
*వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం* కొత్త రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు వేగవంతం చేసిన ప్రభుత్వం వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం మధ్యాహ్నం 12లోగా వీఆర్వోలు.. రికార్డులు అప్పగించాలని ఆదేశం మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తి కావాలని ఆదేశం సాయంత్రంలోగా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదిక రావాలని సీఎస్ ఆదేశం
Read More »కేటీఆర్ అన్ని పదవులకు అర్హుడే
మంత్రి కేటీఆర్ అన్ని పదవులకూ సమర్ధుడేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను సీఎం చేయాలనుకుంటే చేస్తారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేయబోరన్నది తన నమ్మకమని పేర్కొన్నారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో సోమవారం సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చించి, నిర్ణయం …
Read More »సీఏఏను వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా- కేసీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఏఏ ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా.. సీఏఏ వలన దేశం పరువు పోతుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ”సీఏఏ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడుతున్న 8వ రాష్ట్రంగా తెలంగాణ. ఈ బిల్లును వ్యతిరేకించాలని బిల్లుకు మధ్యప్రదేశ్ …
Read More »తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ బిల్లులపై చర్చ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బిల్లులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు, అభయహస్తం పథకం బిల్లుకు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. 29 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లు ఆమోదించింది. తెలంగాణ లోకాయుక్త – …
Read More »అసెంబ్లీలో కవిత జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ సమక్షంలో కవిత బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కవిత కేక్‌ను కట్ చేశారు. అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో కవిత …
Read More »