సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2007లో వసీమ్ జాఫర్ కేప్ టౌన్లో సెంచరీ బాదాడు. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లి.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్ టాప్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న 29 సార్ల టాస్ రికార్డును కోహ్లి అధిగమించాడు. కాగా కోహ్లి టాస్ నెగ్గిన 3 30 …
Read More »పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ
ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 9 ఏళ్లపాటు క్రికెట్ కి దూరమైన టీమిండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కేరళ తరపున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు ట్వీట్ చేశాడు. వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది ప్లేయర్ల లిస్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. రంజీల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
Read More »రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. సోమర్సెట్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు.
Read More »