టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం, విలువలు లేవని.. పండగ రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువలను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు …
Read More »నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించిన మా గురువు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువు(క్రికెట్ కోచ్) రమాకాంత్ ఆచ్రేకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సచిన్ ట్విట్టర్‌లో ఫోటోతో పాటు గురువు గురించి ఇలా చెప్పారు.. గురువు విద్యాబుద్దులు మాత్రమే కాకుండా, మన జీవితంలో ఎలా మెలగాలో తెలిపే విలువలు కూడా నేర్పిస్తారు. ఆచ్రేకర్ సర్ నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. …
Read More »ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదలని రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నలుగుతూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదల్లేదు. ‘టీచర్స్ డే’కు, ‘టీచర్స్ విస్కీ’కి లింక్ పెట్టాడు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? ఊరికే అడుగుతున్నాను” అని ఓ ట్వీట్ పెట్టాడు. అంతకుముందు, తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ …
Read More »ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ,వైసీపీఅధ్యక్షుడు, వైఎస్ జగన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్ జగన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ …
Read More »