Home / Tag Archives: tdp (page 69)

Tag Archives: tdp

తారకరత్న మృతి-బాలకృష్ణ కీలక నిర్ణయం

నందమూరి బాలకృష్ణ, తారకరత్న మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అనుక్షణం వెన్నంటే ఉండి పర్య వేక్షించిన బాలకృష్ణ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూసుకుంటానని, తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి కూడా కుటుంబ పరంగా అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Read More »

బాబు,విజయసాయిరెడ్డి కలయికపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. నటుడు తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం  ఆ పార్టీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆ రాష్ట్ర అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత.. ఎంపీ  విజయసాయిరెడ్డి మాట్లాడుకోవడంపై ప్రముఖ సినీ నిర్మాత.. నటుడు బండ్ల గణేశ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘నా ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ …

Read More »

తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

 ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు.చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం …

Read More »

గుండె పోటుతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికెళ్లారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వైసీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.

Read More »

సీఎం జగన్ పై లోకేష్ సెటైర్

govt permission nara lokesh yuva galam padayatra

ఏపీ  తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …

Read More »

ఏపీ బీజేపీకి భారీ షాక్

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.

Read More »

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.

Read More »

మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్

ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. అందులో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం  భద్రత తగ్గిస్తూ  ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉండగా, దాన్ని 1+1కు తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే  కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు

ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి సుచరిత పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి  సుచరిత స్పందించారు. తాను మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని  స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటాను. పార్టీ మారితే ఇంటికే పరిమితం అవుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat