తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశల పొంగుపై నీళ్లు చల్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కష్టమేనంటూ ఆ పార్టీ వాస్తవ పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. 50 శాతానికిపైగా …
Read More »వీఆర్ఏ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
నిన్న మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు సోమవారం రెవెన్యూశాఖ జీవో నంబర్ 81ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వీఆర్‌ఏ జేఏసీ నేతలకు అందజేశారు. విద్యార్హతల ఆధారంగా వీఆర్‌ఏలకు ప్రభుత్వం మూడు క్యాటగిరీల్లో పేస్కేల్‌ను వర్తింపజేసింది. …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై వేటు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు అనర్హత వేటు వేసింది.. ఈ క్రమంలో తన సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ నేత.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరారావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న …
Read More »తెలంగాణ మహోన్నత కవి దాశరథి
తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సీఎం కొనియాడారు. సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష …
Read More »మరో 24గంటల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!
మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర,ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది.
Read More »మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు
మణిపూర్ అంశంపై ఈరోజు ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభ ల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ప్లకార్డులు చేతబట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభలు స్తంభించాయి. ఈరోజు శుక్రవారం కూడా ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ అంశంపై చర్చకు మళ్లీ …
Read More »మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి పరిస్థితిని వాకోబు చేశారు.వరద ప్రవాహ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. ఉన్న రక్షణ, సహాయక సౌకర్యాలు వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ, నష్టం …
Read More »గోదావరి నదీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సి.ఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని …
Read More »డీపీహెచ్ పరిధిలో కొత్తగా 33 పోస్టులను ప్రభుత్వం మంజూరు
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో కొత్తగా 33 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఐదు డీఎంహెచ్‌వోలతోపాటు డీపీహెచ్ రాష్ట్ర కార్యాలయంలో 28 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరు చేసిన డీఎంహెచ్‌వోలన్నీ హైదరాబాద్ జిల్లా పరిధిలోనివే. సుమారు కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక్క డీఎంహెచ్‌వో పోస్టుతో పర్యవేక్షణ కష్టంగా మారిందని, జీహెచ్‌ఎంసీ తరహాలో ఆరు …
Read More »కరెంటు కోతలు + కారుకూతలు = కాంగ్రెస్ నేతలు
గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు. అజీర్తిని తట్టుకోలేక ఆగమాగమైతున్నరు.తెలంగాణ ప్రభుత్వం సాధించిన విద్యుత్తు విజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గాయిగత్తర లేపుతున్నరు. తమ పాలనా కాలంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తాయిమాయి అవుతున్నరు. బీఆర్‌ఎస్ వచ్చిన తర్వాత వ్యవసాయానికి …
Read More »