ఏపీ పోలీసులపై టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్న టీడీపీ నేతలు..ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నాడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి..సవాలు విసిరారు..అదే గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున హిందూపురం ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. కాగా ఇటీవల టీడీపీ మాజీ …
Read More »సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!
జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …
Read More »టీడీపీ మహిళా నేత అరెస్ట్..ఏం చేసిందో తెలిస్తే షాక్
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ మహిళా నేతను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గతంలో జీవీఎంసీ నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన షేక్ జహనార అప్పటి మంత్రి అండదండలతో పీఎం పాలెం హౌసింగ్ బోర్డు కాలనీ సర్వే నంబరు 20లో ఉన్న భూమిని ఆక్రమించడానికి స్కెచ్ …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో గ్రామ వలంటీర్‌పై టీడీపీనేత పిడిబాకుతో దాడి
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకుడి కుమారుడు పిడిబాకుతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రామంలోని రాముల దేవాలయం సమీపంలో వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఉన్న వలంటీర్ రామానాయుడిపై టీడీపీ నాయకుడు …
Read More »కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్య..రెండు స్కార్పియో వాహనాల్లో ఒక్కసారిగా వేట కొడవళ్లతో
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. టీడీపీ నేత సుబ్బారావును (45) దుండగలు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూం గుహల సమీపంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఈయన స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సుబ్బారావు గ్రానైట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. బెలూం గుహల సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో, …
Read More »దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఫైర్..!
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. వల్లభనేని వంశీతో మొదలైన తిట్ల పర్వం..ప్రస్తుతం మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమల మధ్య సాగుతోంది. సీఎం జగన్ పవిత్రమైన తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం లేదంటూ టీడీపీ చేస్తున్న మత రాజకీయాలపై.. మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. తిరుమలను చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడేమైనా కట్టించాడా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాస్త పరుషపదాలు మాట్లాడారు. సీఎంగా …
Read More »గుడివాడలో టీడీపీకి మరో షాక్..మరో నేత రాజీనామా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో నేత కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు గుడివాడకి తాకాయి. టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలోకి చేరుతున్నారు.దీనితో తనకు బ్యాడ్ టైం …
Read More »ఇరిగేషన్ అధికారులపై టీడీపీ నేత వీరంగం
కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నేత పుట్లూరు శీను వీరంగం సృష్టించాడు.పెద్దొంక ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులపై శివాలెత్తాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అటకాయించడమే కాకుండా తన అనుచరులతో కలిసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె రస్తా పక్కన గల పెద్దొంక నీటి పరివాహక ప్రాంతాన్ని కొందరు టీడీపీ నాయకులతో పాటు పుట్లూరు శీను కుటుంబ సభ్యులు కూడా ఆక్రమించారనే అభియోగాలున్నాయి. …
Read More »మరదలితో అక్రమ సంబంధం..నేరం రుజువు కావడంతో టీడీపీ నేతకు మూడేళ్ల జైలు శిక్ష
అక్రమ సంబంధం కేసులో ఓ టీడీపీ నేతకు మూడేళ్ల శిక్ష పడింది. పెళ్లై భర్త ఉన్న మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కేసులో టీడీపీ నేతకు శిక్ష పడింది. వివరాలు చూస్తే..అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్ …
Read More »పరారీలో అఖిలప్రియ భర్త..పోలీసుల గాలింపు..!
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పరారీలో ఉన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవరామ్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ …
Read More »