తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ శనివారం మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, అన్నాదురైల స్మారక కేంద్రాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరగబోతున్న తరుణంలో ఆమె ఈ నేతలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. తాను రాజకీయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని ఆమె మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని …
Read More »తమిళనాడు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా
తమిళనాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో డీఎంకేతో పాటు కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అక్టోబర్ 6, 9 తేదీల్లో ఆ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ డీఎంకే కూటమి అన్ని పంచాయత్‌లను నెగ్గినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేపై ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఇతర జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో …
Read More »అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి ప్రాంతంలో రూ.39 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కలైవానర్ అరంగం హాలులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం 110వ నిబంధనల కింద ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ.. మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధి ప్రాంతం వద్ద 2.2 ఎకరాల్లో స్మారక మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఏడుదశాబ్ధాలపాటు పాత్రికేయుడిగా, ఐదు దశాబ్దాలపాటు …
Read More »తమిళనాడు వ్యాప్తంగా 3000 పడకలను ఏర్పాటు చేసిన హైదరాబాద్ మేఘా సంస్థ
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ . తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్ ను, ఆస్పత్రులకు …
Read More »సీఎం స్టాలిన్ కు తలనొప్పిగా మారిన ఆ మంత్రి
తమిళనాడు మంత్రి పీకే శేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు, తమిళనాడులో ఉంటూ ధనవంతులుగా మారారని, దానికి కారణం తమపార్టీనే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. వారు EVMల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. ఈ వ్యాఖ్యలు CM స్టాలిన్కు తలనొప్పులు తెచ్చిపెట్టేవేనని నిపుణులు అంటున్నారు.
Read More »తమిళనాడులో లాక్డౌన్
ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …
Read More »ముత్తవెలు కరుణానిధి స్టాలిన్ “ప్రస్థానం”
తమిళ రాజకీయాలు లో 68 సంవత్సరాలు వచ్చిన యువ నాయకుడు గానే వెలుగొందారు.. తండ్రి చాటు బిడ్డ .. రష్యా సోషలిస్ట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ చనిపోయిన 4 రోజులు కి స్టాలిన్ జన్మించారు.. అందుకే కరుణానిధి జోసెఫ్ స్టాలిన్ గుర్తుగా కొడుకు కి స్టాలిన్ అని పేరు పెట్టారు.. 14 ఏటా మేనమామ మురుసోలి మారన్ కి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నట ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. …
Read More »2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »నిధి అగర్వాల్ కి షాక్
తమిళనాడులో కొందరు అభిమానులు తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ షాక్ అయింది. వారు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. అటు తనకోసం నిర్మించిన గుడిని చదువుకు లేదా నిర్వాసితులకు షెల్టర్ కోసం ఉపయోగించాలని కోరింది.
Read More »నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్
విశ్వ విఖ్యాత సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. పార్టీ లో చేరాలనుకునే సభ్యులు 25 వేల రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన సోమవారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేలో జరగనున్న ఎలక్షన్స్ కోసం …
Read More »