తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈరోజు సోమవారం నల్గొండ జిల్లాలో గువ్వలగుట్టకు వెళ్లాల్సిన పర్యటన వాయిదా పడింది. ఈ రోజు మార్నింగ్ నుండి కురుస్తున్న వానల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో గవర్నర్ వెళ్లడం లేదని రాజభవన్ తెలిపింది. గువ్వలగుట్టలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని ఆమె పరామర్శించాలనుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం చింతపల్లి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి.. దేవరకొండ మీదుగా మధ్యాహ్నం గువ్వలగుట్టకు చేరుకుని …
Read More »గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని గవర్నర్ మర్చిపోయారా-
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త భవనాలు అభివృద్ధి కాదంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అంటే గవర్నర్ తమిళ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని అనుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో …
Read More »గవర్నర్ తమిళ సై తో భేటీ కానున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »డాక్టర్ అవతారమెత్తిన గవర్నర్ తమిళ సై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళపై ఓ వ్యక్తికి చికిత్స అందించారు. నిన్న శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఛాతిలో నొప్పితో పాటు ఇతర సమస్యలు వచ్చాయి. దీంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సాయం చేయాలని ఫ్లైట్ సిబ్బంది అనౌన్స్ చేశారు.. అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ అతడికి ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు ఎంబీబీఎస్, ఎండీ-డీజీఓ ను తమిళపై …
Read More »మేం నామినేటెడ్ వ్యక్తులం కాదు: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిధికి లోబడి …
Read More »సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.
Read More »సాయి పల్లవికి అండగా గవర్నర్ తమిళ సై
నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనంపై వివాదం చెలరేగింది. ఓ ట్యాలెంటెడ్ నటిపై ఈవిధమైన బాడీ షేమింగ్ చేయడం పద్ధతి కాదని చాలామంది ఖండించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ వార్తలు తనను బాధపెట్టాయని ఆమె ఆవేదన …
Read More »శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ విడుదలకు సిద్ధం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 100 చిత్రాల్లో హీరోగా..పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ జోరు గత కొంతకాలంగా తగ్గిపోయింది. ఆయన హీరోగా సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇటీవల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాతో ఆయన విలన్‌గానూ …
Read More »ఖైతరాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలి పూజ
ఖైతరాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తొలి పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేయడం తన అదృష్టమన్నారు. కరోనాను విఘ్నేశ్వరుడు పారదోలాలి. ప్రతి ఒక్కరూ …
Read More »పీవీ పేద ప్రజల పెన్నిధి : గవర్నర్ తమిళిసై
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని ప్రసంగించారు. మహా నేత పీవీ నరసింహారావు శత జయంతి.. గొప్ప పండుగ రోజు అని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉంది. పీవీ …
Read More »