తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
Read More »గవర్నర్ కు షాకిచ్చిన సీఎం స్టాలిన్
తమిళనాడులో ‘రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం.. గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించేందుకు కాలపరిమితి విధించాలని కేంద్రంతో పాటు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఇలా సీఎం స్టాలిన్ తీర్మానం చేసిన కాసేపటికే గవర్నర్ ఆర్.ఎన్ రవి దిగివచ్చారు. ఆయన వద్ద పెండింగ్ లో ఉన్న ఆన్ లైన్ గేమ్ …
Read More »ఎన్ని ఆస్తులున్నా.. నేను సంతోషంగా లేను: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
ఎన్ని పేరు ప్రతిష్ఠలు, ఎంత విలువైన ఆస్తులున్నా తాను సంతోషంగా లేనని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ అన్నారు. అనారోగ్యానికి గురైతే కావాల్సిన వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. చెన్నైలో ఓ సంస్థ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే తనకి ఆత్మ సంతృప్తిని అందించాయని చెప్పారు. ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి తెలిసిందన్నారు. హిమాలయాలంటే సాధారణమైన మంచుకొండలు …
Read More »వాళ్ల క్రియేటివిటీ బాగుంది: హార్ట్ ఎటాక్ వార్తలపై విక్రమ్
తనకు హార్ట్‌ఎటాక్ వచ్చిందంటూ వచ్చిన వార్తలన్నింటినీ చూశానని ప్రముఖ నటుడు విక్రమ్ అన్నారు. ఇటీవల విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని.. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ జరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో నిర్వహించిన ‘కోబ్రా’ మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆయన స్పందించారు. జబ్బు పడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫింగ్ చేశారని.. ఫొటోపై నా పేరు పెట్టి థంబ్‌నెయిల్స్‌తో ప్రచారం చేశారన్నారు. వాళ్ల క్రియేటివిటీ బాగుందన్నారు. తన జీవితంలో …
Read More »ప్రజాప్రతినిధులకు తమిళనాడు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
తన పాలనలో అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా మారతానని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. అక్రమాలను ప్రోత్సహించనని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. తమిళనాడులోని నామక్కల్‌లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. మనకు నచ్చిందే చేయడం ప్రజాస్వామ్యం కాదని.. అలా తానెప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. ఈ వార్నింగ్ స్థానిక ప్రజాప్రతినిధులకే కాదని.. ప్రతి ఒక్కరికీ అని క్లారిటీ ఇచ్చారు స్టాలిన్.
Read More »విజయ్‌కాంత్ కాలు మూడు వేళ్లు తొలగింపు
తమిళనాడుకు చెందిన సీనియర్‌నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ కాలికి సర్జరీ జరిగింది. గతకొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కాలికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు సర్జరీ చేయాల్సి వచ్చింది. కాలుకి రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసరంగా మూడు కాలి వేళ్లను తొలగించారు. ఈ మేరకు డీఎండీకే వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. రెండు మూడురోజుల్లో విజయ్‌కాంత్ డిశ్చార్జ్ అవుతారని తెలిపాయి.
Read More »ఘనంగా నయనతార -విఘ్నేష్ శివన్ పెళ్లి వేడుక.. తరలివచ్చిన తారాలోకం
ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ హోటల్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ మెడలో విఘ్నేష్ మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటులు రజనీకాంత్, షారూక్‌ఖాన్ తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులకు వాళ్లంతా మ్యారేజ్ విషెస్ చెప్పారు. నయనతార-విఘ్నేష్ శివన్ …
Read More »భారతీయుడికి అసామాన్య గుర్తింపు.. ప్రకటించిన పోప్
మనదేశంలో 18వ శతాబ్దంలో పుట్టి క్రిస్టియానిటీని స్వీకరించిన దేవ సహాయం పిళ్లైకు ఇక నుంచి దైవదూతగా గుర్తింపు లభించనుంది. క్రిస్టియన్ల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన ప్రత్యేక వేడుకలో దేవసహాయం పిళ్లైను దైవదూతగా పోప్ ప్రాన్సిస్ ప్రకటించారు. ఈ గుర్తింపు లభించిన తొలి భారతీయ సామాన్యుడిగా పిళ్లై చరిత్రలో నిలిచిపోనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి గతంలో ట్రావెన్‌కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ జిల్లాలోని హిందూ నాయర్ల …
Read More »ఫ్యాన్స్‌కి చిరు ‘ఆచార్య’ సర్‌ప్రైజ్
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 29 ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5.49 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్‌ను ఎప్పటిలాగే యూట్యూబ్‌లోనే కాకుండా ఏకకాలంలో 152 థియేటర్లలోనూ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మొత్తం 152 థియేటర్లలో …
Read More »ఘోరం.. లవర్ కళ్ల ముందే ప్రియురాలిపై రేప్!
తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై ముగ్గురు వ్యక్తులు రేప్ చేశారు. ఈ ఘటన వేలచ్చేరి బీచ్‌లో చోటుచేసుకుంది. విర్దునగర్ జిల్లా అరుప్పుకోట ప్రాంతానికి చెందిన యువతి, ఆమె ప్రియుడు ఈనెల 23న బీచ్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండగా ముగ్గురు వ్యక్తులు ప్రియుడిపై దాడి చేసి అతడి కళ్ల ఎదుటే ప్రియురాలిపై రేప్ చేశారు. ఆ తర్వాత ఆమె మెడలోని నగలను దోచుకుని అక్కడి నుంచి …
Read More »