మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆచార్య చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన చిరు ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ మొదలు కాగా, భోళా శంకర్ చిత్రం నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.ఇప్పటికే …
Read More »వాళ్లకు లీగల్ నోటీసులు పంపిన తమన్నా
ఇన్నాళ్లు హీరోయిన్‌గా అలరించిన తమన్నా యాంకర్‌గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. రాను రాను షోకి ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో అనసూయని తీసుకున్నారు.అనసూయ రంగ …
Read More »తమన్నాని చూడలేక ఏడ్చేసిన చిన్నారి
మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్‌లో భయపెట్టించే పాత్రలు పెద్దగా చేయలేదు. నితిన్ నటించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్లను భయపెట్టించింది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. తమన్నాని ఇంత వైల్డ్‌గా చూడలేకపోయిన చిన్నారి ఏడ్చేసింది. దర్శకుడు గాంధీ చిన్న కూతురు లిపి.. తమన్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో తమన్నాని వైల్డ్‌గా చూడలేకపోయింది. వరుస హత్యలు …
Read More »మాస్ట్రో హిట్టా ..? ఫట్టా..?
గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్ చిత్రానికి రీమేక్ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ …
Read More »‘మాస్ట్రో’ నుండి మరో పాట
యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ
బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా నితిన్ 30వ చిత్రం ‘మాస్ట్రో’ రూపుదిద్దుకొంది. ఇందులో నభా నటేశ్ హీరోయిన్‌గా, తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో’ టీమ్ నుంచి విడుదలైన తమన్నా తొలి లుక్ ఇదే! నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని తమన్నా.. …
Read More »నా వంటకు బలయ్యేది వారే!!
మిల్కీబ్యూటీ తమన్నాను ఇప్పటి వరకూ కథానాయికగానే చూశాం. నిజ జీవితంలో ఆమె ఎలా ఉంటారు? ఏం ఇష్టపడతారు? ఎలా ప్రవర్తిస్తుంటారు. ఈ వివరాలేవీ పెద్దగా బయటకు తెలీదు. తెర వెనక తమన్నా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే త్వరలో ప్రసారమయ్యే కుకింగ్ షో చూడాల్సిందే అంటున్నారు. దీని గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాల్లో నటించడం, డబ్బింగ్ చెప్పడం వేరు. ఓ ప్రాంతీయ కుకింగ్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం …
Read More »అసలు తగ్గని మిల్కీ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్నాళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇక ఇప్పుడు హోస్ట్‌గానే అదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాంను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కోసం తమన్నా హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రోమో కూడా విడుదలైంది. ఈ షోకి తొలి గెస్ట్ ఎవరనే దానిపై కొద్ది …
Read More »తమన్నా సరికొత్త సాహసం
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న తమన్నా అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. తమన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలతో తన టాలెంట్ నిరూపించాలని అనుకుంటుంది. ఒకవైపు హీరోయిన్‌గా, మరో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌లకు సిద్ధం అవుతుంది. ఇంకో …
Read More »స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట. బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.
Read More »