త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా …
Read More »ఆగస్టు 5నుండి చేప పిల్లలు పంపిణీ
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీని ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్రమత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేయడంతో ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ ఏడాది 24 చెరువులు, రిజర్వాయర్లలో 81 కోట్ల చేప పిల్లలు, 78 నీటి వనరుల్లో 5 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.
Read More »సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి ట్వీట్..!
తెలంగాణలో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ” మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నందుకు, షూటింగ్ తదితర కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి అనుమతించినందుకు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. అలాగే, సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించిన మంత్రి తలసానికి ధన్యవాదాలు. కోవిడ్-19పై ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత …
Read More »240 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణం
రాజేంద్రనగర్ లో 240 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీని ఉపయోగించాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అత్యాధునిక మెషినరీ కోసం ఇతర రాష్ట్రాలలో అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ …
Read More »లైసెన్స్ లేని మటన్ షాపులపై చర్యలకు మంత్రి ఆదేశం
హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, లైసెన్స్ లేని షాపులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మాసాబ్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆ శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంసం దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై …
Read More »తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి గిరారాజ్ సింగ్ ప్రశంసలు
స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ ఆయనకు ఫోన్ చేసి తెలంగాణలో లాక్‌డౌన్ పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితుల వల్లే లాక్‌డౌన్ పొడిగించామని తలసాని ఆయనకు వివరించారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులు …
Read More »కరోనాను నివారిద్దాం
ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి మంత్రి తలసాని బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ఆమలు చేస్తున్న కార్యక్రమాల ఆమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి …
Read More »అన్నార్తులకు అండగా..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గుజరాతీ, మర్యాడీ, వైశ్య సేవా సంస్థలు తమ వంతుగా సామాజిక ధృక్పథాన్ని చాటారు. సికింద్రాబాద్‌లోని గుజరాతీ సేవా మండల్, కాచిగూడలోని వైశ్య హాస్టల్, బేగంబజార్‌లోని మర్వాడీ సమాజ్, లక్డీకపూల్‌లోని వాసవి సేవా కేంద్రం ఒక్కొక్కరై ఐదు వేల మందికి చొప్పున రోజుకు ఇరవై వేల మంది నిరుపేదలకు వచ్చే నెల రోజుల పాటు భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. గుజరాతీ సేవా …
Read More »అధిక ధరలకు మాంసం విక్రయించే వారిపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. మాంసం, చేపల సరఫరాపై ప్రధానంగా చర్చించారు. వీటి రవణాకు జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తమని మంత్రి తలసాని చెప్పారు. ఇందుకు పశు, మత్స్య, పోలీసు, రవాణాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి..సమన్వయ కమిటీల ఏర్పాటుకు నోడల్ అధికారిని నియమిస్తమన్నారు. గొర్రెలు, మేకలు సరఫరా ఆగిపోవడంతో మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. అటు …
Read More »మంత్రి తలసానిని కల్సిన కలెక్టర్ శ్వేతమహంతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన అందే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని చాంబర్ లో మంత్రి శ్రీనివాసయాదవ్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతమహంతి మర్యాదపూర్వకంగా …
Read More »