పశు సంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. వివిధ రాష్ర్టాల పశు సంవర్ధకశాఖ మంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదేస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పశు సంవర్ధకశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. కులవృత్తులకు ప్రాణం పోసేలా …
Read More »పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడం, పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా విజయ మెగా డెయిరీని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తిచేస్తామని, మెగా డెయిరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో …
Read More »మలక్‌పేటలో నేడు 288 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..
మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అంతస్తుల్లో రూ. 24.91 కోట్ల వ్యయంతో నిర్మించారు. హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో మురికివాడగా ఉన్న పిల్లిగుడిసెలు బస్తీలో ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. …
Read More »హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీతోపాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్ హొళ్లలో పూడిక తొలగింపు జరుగుతున్నదని తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం హైదరాబాద్‌లో నిత్యం ఆందోళనలు జరిగేవని, ప్రస్తుతం ఆ …
Read More »యాదాద్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. వారివెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.
Read More »శాసన సభ్యుడిగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని …
Read More »వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి-మంత్రి తలసాని
జైలుకు వెల్లినోడు జైలు గురించి మాట్లాడి సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో మాట్లాడుతున్నాడంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ‘‘హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేము తలుచుకుంటే ఇక్కడ ఎవ్వడు ఉండరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మాకంటే బలవంతుడు ఎవడుంటాడు? జనాన్ని చూసుకొని పిచ్చి కూతలు కూస్తే మేమేంటో చూపిస్తాం. కొంతమంది దద్దమ్మలు దళిత బంధు మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ …
Read More »ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. మహంకాళి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు.
Read More »తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుండి ఆహార భద్రత కొత్త కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని సీఆర్‌ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. మొదటి విడతలో …
Read More »గొల్ల, కురుమలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి …
Read More »