నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని జగన్ దైవసాక్షిగా ప్రమాణం చేసారు. అయితే కుమారుడు గొప్ప స్థానానికి ఎదిగితే ఏ తల్లి అయినా ఎంతో సంతోషిస్తుంది. విజయమ్మ కూడా అలాగే సంతోషపడి …
Read More »జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్ వర్మ
తన జీవితంలో మొట్టమొదటిసారి ఓ రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్జీవీ వెళ్లారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైసీపీకి ప్రజలు భారీగా కట్టంకట్టారన్నారు. జగన్ చారిత్రాక విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి …
Read More »మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?
దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్‌కాల్స్ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, అనుప్రియ పటేల్, రాందాస్ అథావలే, మిత్రపక్ష నేత …
Read More »రెండున్నర నెలల్లో 4 లక్షల ఉద్యోగాలిస్తాం.. జగన్ సంచలన ప్రకటన
‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాంమని సీఎం జగన్ అన్నారు. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతాలతో గ్రామ వాలంటీర్లను నియమిస్తామన్నారు. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం ఉంటుందన్నారు.. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట …
Read More »పదేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారో తెలుసా.?
గవర్నర్ నరసింహన్ అరుదైన రికార్డు సాధించారు.పదేళ్లల్లో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులచే నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఆయనకే దక్కింది.2010లో కిరణ్ కుమార్ రెడ్డి,2014 జూన్ 2 న తెలంగాణ సీఎంగా కేసీఆర్,2014 జూన్ 8న ఏపీ సీఎం గా చంద్రబాబు,2018 డిసెంబర్ 13న రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్,2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. పదేళ్లలో ఐదు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం …
Read More »వైఎస్ జగన్ తొలి సంతకం ఇదే..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం పూర్తయింది.మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు.. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ కు, డీఎంకే అధినేత స్టాలిన్ కు అభినందనలు తెలుపుతూ..పదేళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను..పాదయాత్ర లో ఇచ్చిన హామిలో భాగంగా పెన్షన్లు 3వేలు ఇస్తున్నానని తన మొదటి సంతకం పెట్టారు.జూన్ నుంచి 2250 ఇస్తామని వీటిని ప్రతీ ఏడాది 250కు …
Read More »నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతిరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల …
Read More »తొలి ప్రసంగంలోనే జగన్ ప్రతిజ్ఞ వాటి గురించేనంట..!
ఏపీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేల సంచలన ప్రకటనలు చేయనున్నారు. తనను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వసనీయత చాటుకుంటూనే..పాలనలో విప్లవాత్మక నిర్ణయాల దిశగా జగన్ ప్రసంగం ఉండనుంది. తన ప్రమాణ స్వీకార వేదికగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో చేయబోయే తొలి ప్రసంగం పైన రాజకీయ పార్టీలే కాకుండా..సామాన్య ప్రజలు సైతం ఆసక్తితో ఉన్నారు. తనను గెలిపించిన నవ రత్నాల అమలుకు జగన్ …
Read More »బెజావాడలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే..అది చూసిన తెలుగు తమ్ముళ్ళు?
విజయవాడలో ఏ వీధి చూసిన జనంతో కిక్కిరిసిపోయింది.ఏ సెంటర్ చూసిన పండగ వాతావరణంలా కనిపిస్తుంది.విజయవాడలో ఇలాంటి పండుగ వాతావరణం ఒక దసరాకి మాత్రమే ఉంటుంది. అలాంటిది ఈరోజు అంతకుమించి ఉందని చెప్పుకోవాలి.ఎందుకంటే ఈరోజు ఆంధ్రరాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించగా,అధికార టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.దీనికి సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మారింది.ఆ …
Read More »పదేళ్లుగా ప్రజల్లోనే గడిపిన వైఎస్ జగన్..అదే ప్రజా శ్రేయస్సు కోసం నేడు ప్రమాణ స్వీకారం
దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మినహా దేశంలోనే మరొకరు లేరన్నది నిస్సందేహం. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించాలన్న నిర్ణయం జగన్ గమ్యాన్ని, గమనాన్ని మార్చేసింది. ఓదార్పు యాత్రలో భాగంగా 800 మందికి పైగా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వైసీపీని స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం …
Read More »