ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫస్టియర్ స్టూడెంట్స్‌ను సుమారు 20 మంది సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం జూనియర్ల హాస్టల్‌లోకి వెళ్లి వారి డ్రెస్సులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడం, సీనియర్ల హోంవర్క్ చేయిండం లాంటివి చేశారు. దీంతో ఓ విద్యార్థి ఈనెల 25న ఢిల్లీలోని యాంటీ …
Read More »వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు)ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో వైకాపా అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుబ్రమణ్యం మరణానికి తానే బాధ్యుడినంటూ పోలీసులకు అనంతబాబు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేశారు.
Read More »ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్..
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికేసిన ఘటనను రాష్టప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు మరో ఇద్దరు వైద్యులను …
Read More »