ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టరాదని తెలిపింది.
Read More »ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యూడీషియల్ అధికారిని నియమించాలని సూచించింది. వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేసి నివేదికలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని పేర్కొంది. రఘురామ బెయిల్ పిటిషన్ను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read More »సుప్రీం కోర్టుకు RRR
బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
Read More »దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టురూమ్‌లతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
Read More »కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక నిర్ణయం
వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్ సింగ్ మాన్(బీకేయూ), ప్రమోద్ కుమార్ జోషి(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), …
Read More »టీడీపీ నేతకు సుప్రీం షాక్
డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసు మంగళవారం జస్టిస్ ఎ.ఎం ఖన్విల్‌ఖర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తులు.. …
Read More »ఏపీ స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో …
Read More »నిర్భయ దోషికి సుప్రీం షాక్
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు నిర్భయ దోషికి షాకిచ్చింది. తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. విచారణకు కాదు కనీసం ఆ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం ఒప్పుకోలేదు. దీంతో ముఖేష్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున …
Read More »మార్గదర్శి కుంభకోణంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం…!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసుపై సుప్రీంకోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ వేల కోట్ల డిపాజిట్లను ఖాతాదారులనుంచి సేకరించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైయస్ హయాంలో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్ మార్గదర్శి కుంభకోణంపై కేసులు వేశారు. దీంతో అప్పట్లో రాష్ట్ర …
Read More »జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్
ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …
Read More »