ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ కరోనా బారిన పడగా.. వారికి హైదరాబాద్ మహానగరంలోని AIG ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటు విజయవాడలోని రాజభవన్లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజభవన్లో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
Read More »