ఈరోజు మంగళవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో MRF కంపెనీ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి చెందిన షేర్లు రూ.లక్ష మార్కును అందుకుంది.. అయితే ఈ ఘనత అందుకున్న ఏకైక భారతీయ కంపెనీగా MRF నిలిచింది. 2002లో ఈ సంస్థ షేర్ ధర రూ.1000గా ఉండగా, 2021 జనవరి 20 నాటికి రూ.90వేలకు చేరింది. ఇవాల్టి ట్రేడింగ్లో రూ.లక్ష మార్కును దాటి ఆల్ టైం హై గా …
Read More »స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,465 వద్ద స్థిరపడింది. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి.. అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC బ్యాంక్, M&M, JSW స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
ఈ రోజు మంగళవారం దేశీయ మార్కెట్లన్నీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభం దశలోనే సెన్సెక్స్ 187పాయింట్లను లాభపడి 41,125పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం యాబై ఒక్క పాయింట్లను లాభపడి 12,105వద్ద కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్,దేవాన్ హౌసింగ్,రిలయన్స్ క్యాపిటల్ షేర్లు లాభపడుతున్నాయి. ట్రైడెంట్ ,వర్లుపూల్,మాగ్మ ఫిన్ కార్ప్ ,సుజ్లనాన్ ఎనర్జీ షేర్లు నష్టంలో కొనసాగుతున్నాయి.
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు బుధవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిప్టీ 53పాయింట్ల లాభాన్ని గడించి .. 11900వద్ద ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 172పాయింట్లు లాభపడి 40,412పాయింట్ల వద్ద ముగిసింది. చివరి గంటలో కొనుగోళ్లు భారీగా జరగడంతో నిప్టీ భారీగా పుంజుకుంది.డాలర్ తో రూపాయి మారకం విలువ 70.83గా ఉంది. ఎన్టీపీసీ,ఐఓసీ,ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. యఎస్ బ్యాంకు,వేదాంత,హీరో మోటోకార్స్ ,భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాన్ని చవిచూసాయి.
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ …
Read More »నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
వరుసగా లాభాలతో దూసుకుపోతున్న దేశీయ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఈ రోజు బుధవారం ఉదయం లాభాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు ఎండింగ్లో మాత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో 38,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 11,440 వద్ద ముగిసింది. దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్బీఐ నాలుగేళ్ల తర్వాత తన షేర్ విలువలో 7.7% నష్టాన్ని చవిచూసింది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.
Read More »లాభాల్లో మార్కెట్లు
కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. దాదాపు రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడవుతుంది. నిఫ్టీ ఆరు వందలకు పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అయితే గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ పరుగులు పెట్టడం గమనార్హం . ఇక రూపాయి విలువకొస్తే మారకం విలువ రూ.71.06వద్ద కొనసాగుతుంది.
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More »