తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
Read More »బండి సంజయ్ కౌన్సిలర్‌గా కూడా పనికిరారు: శ్రీనివాస్‌గౌడ్
ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలుపెట్టి.. మతం, కులం పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. పచ్చని పాలమూరు జిల్లాలను ఆయన విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.20వేల కోట్లతో పూర్తయ్యేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు కాళేశ్వరం …
Read More »మన ఊరు- మన బడిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »డ్రగ్స్ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్‌లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్‌లోని పబ్ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …
Read More »కులవృత్తులను అవహేళన చేస్తే ఊరుకోం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »ఎర్రవల్లి ఫాం హౌజ్ లో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ..?అందుకేనా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులు తన్నీరు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలకర్,శ్రీనివాస్ గౌడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,సబితా ఇంద్రారెడ్డి తో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్ సోమేష్ కుమార్,సీఎంఓ ఓఎస్డీ స్మితా సబర్వాల్,ఫైనాన్స్ కమిషనర్,ఫైనాన్స్ సీఎస్ లతో సహా పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు. సుధీర్ఘంగా ఈ భేటీ జరుగుతూ ఉంది. ఈ భేటీలో ఇటీవల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు హోళీ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు#HappyHoli pic.twitter.com/XBwDc0doEI — Pocharam Srinivas Reddy (@PSRTRS) March 18, 2022 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీరు ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. #HappyHoli All pic.twitter.com/Tka7RRgAcM — KTR …
Read More »దేశాన్ని బాగుచేయడం కేసీఆర్ వల్లే అవుతుంది: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ తీసుకురాలేదని ఆరోపించారు. మతకలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడేళ్లలో …
Read More »మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు CM KCR నివాళులు
ఇటీవల మృతి చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు హాజరైన సీఎం.. మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, …
Read More »అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రోగి బంధువులు …
Read More »