పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్ బౌలర్ ఒక బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బౌలింగ్ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలు అంటించారు. పాకిస్థాన్-శ్రీలంక మధ్య చివరిదైన రెండో టెస్టులో భాగంగా ఆదివారం మూడో రోజు ఆట జరిగింది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కరుణరత్నే-డిక్వెల్లా బ్యాటింగ్ చేస్తుండగా …
Read More »