తెలంగాణ రాష్ట్రం వస్తేనే పడావు భూములకు పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో వలసలు బందయినయ్. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనయ్. తమ బిడ్డకు నివాళిగా గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గొల్లపల్లిని ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. …
Read More »