విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. నవంబర్ 5 , మంగళవారం నాడు. జూబ్లిహిల్స్‌లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను అద్భుతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య …
Read More »విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ఏపీ గవర్నర్…!
అక్టోబర్ 31 న అంటే రేపు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగనున్నాయి. రేపు స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీ …
Read More »చందానగర్ శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి..!
హిందూ ధర్మ ప్రచారాయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జలవిహార్ రామరాజు నివాసంలో రెండు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, వివిధ ఆలయాలను దర్శిస్తున్నారు. ఇవాళ స్వామివారు చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు పూలవర్షం కురిపిస్తూ, …
Read More »భాగ్యనగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి ధర్మ ప్రచారయాత్ర..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్‌లో దిగ్విజయవంతంగా సాగుతోంది. ధర్మప్రచార యాత్రలో భాగంగా జూబ్లిహిల్స్ లోని జలవిహార్ రామరాజు దంపతుల నివాసంలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, శుభాశీస్సులు అందజేశారు. రామరాజు నివాసంలో బస చేసిన స్వామివారిని సినీ దర్శకుడు, ఎస్వీబీసీ …
Read More »ఖమ్మంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు ఘనంగా పుష్పాభిషేకం..!
విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరం, బైపాస్‌రోడ్డులోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌లో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో జరిగిన పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి …
Read More »భద్రాద్రి సీతారాముల సన్నిధిలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి..!
విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామిజీలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఇరువురు స్వామిజీలు సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో టి. రమేష్ బాబు, అర్చకులు శ్రీ స్వరూపానందేంద్రకు సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాలు అందించారు. …
Read More »ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ప్రారంభం..!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అక్టోబర్ 13, సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. యాత్ర నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. బురాన్‌పురం నుంచి గాయత్రి రవి ఇంటివరకు మహిళల కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. …
Read More »కాళేశ్వరుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం నాడు శ్రీ కాళేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామిజీ ఆగమనం సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. యమస్వరూపుడిగా ఉండే …
Read More »ధర్మపురి లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని స్వామివారు దర్శించుకున్నారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, నదీమతల్లికి హారతినిచ్చారు. తదనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశా రు. స్వామివారి ఆగమనం సందర్భంగా …
Read More »1000 కి.మీ. పూర్తి చేసుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ …
Read More »