ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుష్ఫాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. వెస్ట్‌మారేడుపల్లిలోని మంత్రి తలసాని నివాసంలో జరిగిన ఈ పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగా సాగింది. తమ నివాసానికి విచ్చేసిన ఇరువురు స్వామిజీలకు మంత్రి తలసాని దంపతులు, ఆయన …
Read More »విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ఏపీ గవర్నర్…!
అక్టోబర్ 31 న అంటే రేపు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగనున్నాయి. రేపు స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీ …
Read More »అక్టోబర్ 31 న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి పుట్టినరోజు వేడుకలు…శ్రీ స్వాత్మానందేంద్ర..!
అక్టోబర్ 31న నాగులచవితి, గురువారం నాడు భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలే ఊపిరిగా..స్వధర్మ పరిరక్షణకు అహర్నిశలు పాటుపడుతున్న..విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు, గురువర్యులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం సిద్ధమవుతోంది. ఈ రోజు చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తమ గురువర్యులు, పీఠాధిపతులైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకల …
Read More »ఖమ్మంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు ఘనంగా పుష్పాభిషేకం..!
విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరం, బైపాస్‌రోడ్డులోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌లో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో జరిగిన పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి …
Read More »సహస్ర చండీయాగంలో పాల్గోన్న శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు
విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సహస్ర చండీయాగం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అర్చకుల వేదమంతోచ్ఛారణల మధ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామిజీలకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివార్ల …
Read More »భద్రాద్రి సీతారాముల సన్నిధిలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి..!
విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామిజీలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఇరువురు స్వామిజీలు సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో టి. రమేష్ బాబు, అర్చకులు శ్రీ స్వరూపానందేంద్రకు సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాలు అందించారు. …
Read More »ఖమ్మం జిల్లాలో సహస్ర చండీయాగానికి విచ్చేసిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతికి ఘనస్వాగతం..!
ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సహస్ర చండీయాగానికి ముఖ్యఅతిధిగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు విచ్చేశారు. స్వామిజీలకు వేదమంతోచ్ఛారణల మధ్య, పూలవర్షం కురిపిస్తూ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామివార్లకు ఎదురేగి …
Read More »కొత్తకొండ వీరభద్రుడికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పూజలు…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగి పోతుంది. ఐదవ రోజైన గురువారం నాడు స్వామివారు సుప్రసిద్ధ కొత్తకొండ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్రకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో వీరభద్రుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. …
Read More »మడికొండలో శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు…!
హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ రోజు వరంగల్ నగరం, మడికొండలో కొలువై ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని విశాఖ శ్రీ శా రదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ మెట్టు రామలింగేశ్వరుడికి స్వామివారు పంచామృతాలతో అభిషేకం చేసి, పూజలు చేశారు. …
Read More »వరంగల్ నగరంలో విశాఖ ఉత్తరాధికారి పర్యటన…అమ్మవారికి ప్రత్యేక పూజలు..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామిజీ పాల్గొంటున్నారు. మూడవరోజైన మంగళవారం నాడు స్వామివారు స్వయంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన, హారతి, చండీ హోమం, చండీ పారాయన, దుర్గా పూజ, …
Read More »