ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఆడిన తొలి 3 మ్యాచులకు గాను మూడింట్లో నెగ్గడం ఆర్సీబీ కి ఇదే తొలిసారి. ముంబై, హైదరాబాద్, KKRపై జయకేతనం ఎగరేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ABD, మ్యాక్స్వెల్ అద్భుతమైన ఫామ్ ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఇక RCB జోష్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి RCBకి తిరుగులేదని, కప్పు కొడుతున్నాం …
Read More »కోహ్లికి అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ కోహ్లి 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్(1971) జరిగి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 254మ్యాచ్ 12,169 పరుగులు చేశాడు. దశాబ్దాల ప్రకారం 1970-రిచర్డ్స్, 1980 – కపిల్ దేవ్, 1990 సచిన్, 2000-మురళీధరన్ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు.
Read More »రికార్డు సృష్టించిన పాక్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 203/5 పరుగులు చేసింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్.. 18 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 59 బంతుల్లో 122 పరుగులతో చెలరేగాడు. టీ20ల్లో పాకిస్థాన్కు అత్యధిక రన్ ఛేజింగ్ ఇదే కావడం విశేషం. ఈ విజయంతో 4 …
Read More »అభిమానులకు బజ్జీ గుడ్ న్యూస్
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ..29 అక్టోబర్, 2015న గీతా భస్రా అనే బాలీవుడ్ బ్యూటీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో ఈ దంపతులకు అమ్మాయి జన్మించగా, ఇప్పుడు జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. హర్భజన్, గీతాల కూతురు హినయా హీర్ ప్లహా తాను అక్కను కాబోతున్నట్టు ప్లక్కార్డ్ పట్టుకొని ఫొటోకి ఫోజులిచ్చింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న …
Read More »టీమిండియా గ్రాండ్ విక్టరీ
ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …
Read More »రికార్డుల రారాజు విరాట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.
Read More »TOP -10 లో రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ICC ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి ఎగబాకాడు. హిట్ మ్యాన్ కు 742 పాయింట్లు ఉండగా విరాట్ 836 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. పూజారా 10వ ర్యాంకులో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్ మూడో ర్యాంకులో ఉండగా, బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.
Read More »ఇంగ్లాండ్ చెత్త రికార్డులు
పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చెత్త రికార్డులు నమోదు చేసింది. 1983 తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ టీంకు ఇదే తక్కువ స్కోరు. 1983లో న్యూ జిలాండ్ తో 175 పరుగులు చేయగా ఇప్పుడు 193 పరుగులకు కుప్పకూలింది. ఇండియాతో జరిగిన మ్యాచుల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇండియాతో గత 5 ఇన్నింగ్స్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా 200కు పైగా రన్స్ …
Read More »ధోనీ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో స్వదేశంలో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడిగా ఘనత సాధించాడు. ధోనీ స్వదేశంలో 30 టెస్టులకు సారథ్యం వహించి 21 మ్యాచులు గెలిపించగా, కోహ్లి 29 మ్యాచుల్లో 22 మ్యాచులను గెలిపించాడు అజాహరుద్దీన్ 20 మ్యాచుల్లో 13 విజయాలను సాధించాడు
Read More »ప్రమాదానికి గురైన గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కారు
అమెరికాకు చెందిన దిగ్గజ గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కారు ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజిల్స్ లోని ఓ హైవేపై అతడు వేగంగా వెళ్తుండగా ఘటన జరిగింది వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో వుడ్స్ కు గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. ఆ దేశ టైమింగ్ ప్రకారం మంగళవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం వుడ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, అతడి కాలికి వైద్యులు సర్జరీ చేశారు.
Read More »