సరిగ్గా పదహారు ఏండ్ల కిందట అంటే 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అప్పటి కెప్టెన్ ..టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ యంగ్ ప్లేయర్లతోనే గెలిపించాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ ఆటగాడు .. ఆప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. నెటిజన్ చేసిన ట్వీట్ పై హర్బజన్ స్పందిస్తూ ‘అవును.. అతనొక్కడే ఒంటరిగా ఆడాడు. మిగతా 10 మంది ఆడలేదు. …
Read More »శార్దూల్ మరో రికార్డు
ఆసీస్ తో WTC ఫైనల్లో కష్టాల్లో భారత్ ను శార్దూల్ 51 రన్స్ తో ఆదుకున్నారు. ఈ క్రమంలో ఓ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో 8 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగుకు దిగి 4 హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో చేరారు. కిరణ్ మోరే 21 ఇన్నింగ్సుల్లో 5 ఫిఫ్టీస్ చేయగా, శార్దూల్ 13 ఇన్నింగ్సుల్లోనే 4 ఫిఫ్టీస్ చేశారు. ఆ తర్వాత …
Read More »WTC ఫైనల్ టెస్టులో టీమిండియా గెలుస్తుందా..?
WTC ఫైనల్ టెస్టులో చివరి రోజైన నేడు ఆదివారం 280 పరుగులు చేస్తే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ అన్నారు. ‘విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉంది. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లి ఔటయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వొద్దు’ అని జస్టిన్ లాంగర్ …
Read More »రెజ్లర్ సాక్షిమాలిక్ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో రెజ్లర్ సాక్షిమాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిరసనను ముగించట్లేదు.. ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని అమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తమకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
Read More »రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం
తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది
Read More »వార్నర్ చాలా డేంజరస్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …
Read More »గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …
Read More »భారత్ రైజర్లపై దాడిని ఖండించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అడ్డుకున్న ఘటనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(United World Wrestling) శాఖ స్పందించింది. రెజ్లర్ల అరెస్టును యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ఖండించింది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన చేసింది. ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు …
Read More »ఇండియా గేట్ వద్ద రెజ్లర్లు ఆమరణ నిరాహార దీక్ష
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల …
Read More »రిటైర్మెంట్ పై ధోనీ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ కెరీర్‌కు స్వస్తి పలికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని సంకేతాలు అందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బందిపడ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జట్టు సొంతం చేసుకున్నది. …
Read More »