కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. …
Read More »Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Read More »అయ్యా పవనూ.. పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా…!
అంతా అనుకున్నట్లే జరుగుతోంది…జనసేన జెండా పీకేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్..ప్రస్తుతానికి కాషాయం పార్టీతో కలిసిపోయారు..త్వరలో పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మిగిలింది. విజయవాడలో లాంఛనంగా జనసేన జెండాకు కాషాయం రంగు అద్దారు.. ఆ పార్టీ నేతలతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇక నుంచి వైసీపీ సర్కార్‌పై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ సర్కార్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు …
Read More »ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిల ద్రోహం..టీజీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 20 రోజులుగా అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండీ నిర్వహిస్తున్నాడు. అలాగే కర్నూలు, వైజాగ్‌లలో రాజధానులు ఏర్పాటు చేయద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగించాలంటూ బాబు రచ్చచేస్తున్నాడు…విశాఖలో రాజధాని పెడితే తుఫానులు వస్తాయని…అలాగే కర్నూలు రాజధానిగా పనికారాదని, తరచుగా వరద ముప్పు ఉంటుందంటూ…చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు …
Read More »ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో గళమెత్తండి.. పార్టీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం
త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలందరికీ దిశానిర్దేశం చేశారని వైయస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మిథున్‌రెడ్డి, సీఎం అదేశాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వైయస్సార్‌సీపీ తరపున గట్టిగా ప్రశ్నిస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదాతో …
Read More »రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ప్రభుత్వం కృషి చేస్తుంది..బుగ్గన
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని రాష్ట్రాన్ని విభజించారని ఆయన గుర్తు చేశారు. రాజధాని లేకుండా విభజనకు గురైన రాష్ట్రం ఏపీ రాష్ట్రమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు …
Read More »జగన్ సూచనలతో కేంద్రంపై పోరాడేందుకు వైసీపీ ఎంపీల కసరత్తు.. మంచే జరగాలని ఆశిద్దాం..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిననాటినుంచి ఇప్పటిదాకా కేంద్రం మీద పల్లెత్తు మాట కూడా అనలేదు.. తాజాగా బడ్జెట్ విషయంలో కేంద్రాన్ని నిందించే అవకాశం వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకి అసలేమీ ఒరిగే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో ఇప్పటిదాకా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తూ వచ్చిన వైసీపీ మోడీని కాకుండా కేంద్రాన్ని తిడుతున్నారు. అలాగే బడ్జెట్ పెట్టినరోజే ఆపార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …
Read More »చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !
చంద్రబాబు 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం అందరికి తెలిసిందే.పొత్తులు పెట్టుకొని మరీ గెలిచి ప్రజలకు అన్యాయం చేసాడు.2014లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆమోదించిందని,ఆ సమయంలో చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు లేఖ రాసారా అని జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని ప్రశ్నించారు.పైకి మాటలు చెప్పడం తప్ప హోదా అమలు చేయడానికి కనీసం ప్లానింగ్ కమిషన్ కి లెటర్ కూడా రాయలేని …
Read More »వైసీపీ చేతిలో 20 ఎంపీ సీట్లు.. హోదాపై సంతకం పెట్టు.. నేను మద్దతిస్తానంటున్న జగన్
ఎన్నికలు, ప్రచారాలు ముగిసిపోయినా ఇంకా కేంద్రంలో అధికారంకోసం, అధికారంలో భాగం కోసం రాష్ట్రీయ పార్టీల ఎత్తుగడలు జాతీయస్థాయిలో కొనసాగుతున్నాయి. కేంద్ర పీఠంకోసం రాజకీయం రంజుగా జరుగుతోంది. మరోసారి అధికారంకోసం బీజేపీ, ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తో పాటుగా కేంద్రంలో చక్రం తిప్పాలంటూ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల అధినేతలు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హస్తినగడ్డపై తిరుగుతున్నారు. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పట్ల వన్ సైడెడ్ గా ప్రజలు లేకపోవడం …
Read More »జగన్ సంచలనం…ఏపీకి మంచి జరుగుతుందంటే ఎవరికైనా మద్దతిస్తా
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తొలినుంచి గళం విప్పుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు ఈ విషయంలో తన వైఖరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్ 2019’లో ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు. ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హెదా ఇచ్చే ఏ పార్టీకైనా సరే… తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా …
Read More »