గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.
Read More »యూపీ అసెంబ్లీ ఎన్నికలకి తొలి విడత నోటిఫికేషన్ విడుదల
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యాయి.. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
Read More »ప్రధాని మోదీకి షాక్
ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్‌బిహారీ యాదవ్ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …
Read More »పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
దేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311మంది ఎంపీలు ఓటు వేశారు. ఎనబై మంది ఎంపీలు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ కు ముందు నిన్న ఆర్ధరాత్రి వరకు ఈ బిల్లుపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో కల్సి టీఆర్ఎస్,ఎస్పీ,బీఎస్పీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సిట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి …
Read More »తాడిపత్రిలో జేసీకి షాక్ ఇచ్చిన ఎస్పీ.. జిల్లా బహిష్కరణ అధికారికంగా ఉత్తర్వులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో అసాంఘిక శక్తిగా చలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్‌వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు… రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న ఎస్‌వీ రవీంద్రారెడ్డి పాతికేళ్లుగా తాడిపత్రిని శాసించాడు. తాడిపత్రి మండలం, దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి …
Read More »శభాష్ ఎస్పీ సిద్థార్థ కౌశల్ …సీఎం వైఎస్ జగన్
నాడు–నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమర్థంగా సభ నిర్వహించారంటూ ఎస్పీ సిద్థార్థ కౌశల్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ శభాష్ సిద్ధార్థ..అంటూ ప్రశంసించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కావడం, వేదిక మొత్తం జనంతో కిక్కిరిసి పోయింది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో తీసుకున్న …
Read More »ఏపీ డీజీపీ సంచలన నిర్ణయం..వెంటనే ఎస్పీలకు ఆదేశం !
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాస్వీకారం చేసినప్పటి నుండి తాను చేస్తున్న ప్రతీ పని ఒక సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సంచలనాల్లో ఒకటి ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ని నియమించడం. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇతను ఒక సంచలనానికి దారితీసాడు. పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు …
Read More »ఎంపీడీవోపై దాడి కేసు…ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. పార్టీకి తనను దూరం చేసేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు కుట్ర …
Read More »అడ్డంగా దొరికిపోయిన బెట్టింగ్ రాజా..విచారణ జరిగితే కోడెల ఔట్
పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని …
Read More »