తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్ కౌంటర్పై.. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ VS సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్ కౌంటర్ టైంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న VC సజ్జనార్ను తొలిసారిగా కమిటీ విచారించనుంది. ఆయనకు సమన్లు జారీ చేసిన కమిషన్.. మంగళవారం లేదా బుధవారం విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దిశ ఎన్ కౌంటర్పై NHRC నివేదికపై నేడు విచారణ జరగనుంది.
Read More »సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …
Read More »రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటాం: సీపీ సజ్జనార్
బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి …
Read More »