Home / Tag Archives: southafrica (page 3)

Tag Archives: southafrica

70రన్స్ లీడ్ లో టీమిండియా

ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3వ టెస్టులో 2వ రోజు ఆట పూర్తయింది. 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ స్టంప్స్ సమయానికి 2వికెట్లు కోల్పోయి 57పరుగులు చేసింది. రాహుల్-10, మయాంక్-7 మరోసారి విఫలమయ్యారు. కోహ్లి-14, పుజారా-9 క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది. పేసర్ బూమ్రా.. సఫారీల నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 223రన్స్ చేసింది. ప్రస్తుతానికి 70రన్స్ లీడ్ ఉంది.

Read More »

కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు

సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.

Read More »

210పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

కేప్టాన్ లో జరుగుతున్న నిర్ణయాత్మక 3వ టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ని భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో సఫారీ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ 210పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో పీటర్సన్-72 రాణించాడు. మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో బుమ్రా-5, ఉమేశ్ యాదవ్-2, షమీ-2, శార్దూల్ ఠాకూర్-1 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ భారత్ 223రన్స్ చేసింది. 13పరుగులు ముందంజలో ఉంది.

Read More »

విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలి

దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్టాన్ లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ లో అజింక్య రహానెకు బదులుగా విహారిని జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. రెండో టెస్టుకు కోహ్లి దూరమవడంతో విహారికి అవకాశం ఇచ్చారు. మూడో టెస్టు కోసం కోహ్లి తిరిగి జట్టులో చేరనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలని, రహానె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడని గౌతీ చెప్పాడు.

Read More »

రికార్డుకు చేరువలో కోహ్లీ

టీమిండియా పరుగుల యంత్రం…విరాట్ కోహ్లి ఇప్పటికి 98 టెస్టులు ఆడాడు. వెన్నునొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఆ దేశంలో మూడో టెస్టు ఆడితే 99 మ్యాచ్ లు పూర్తవుతాయి. స్వదేశంలో శ్రీలంకతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగే మ్యాచ్లో కోహ్లికి వంద మ్యాచ్ లు పూర్తవుతాయి. అదే స్టేడియంలో 360 డిగ్రీస్ ఆటగాడు డివిలియర్స్ కూడా వందో టెస్టు ఆడాడు. ఇద్దరూ కూడా IPLలో బెంగళూరుకే …

Read More »

జొహానెస్ బర్గ్ లో టీమిండియాకు మంచి రికార్డు

ఇటీవల జరిగిన సెంచూరియన్ లో టెస్ట్ మ్యాచు గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో కోహ్లి సేన రెండో టెస్టులో సౌతాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. టీమ్ ఇండియాకు మంచి రికార్డున్న జొహానెస్ బర్గ్ వేదికగా మ్యాచ్ మ.1.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా.. దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రోటీస్ చూస్తోంది. అయితే.. ఈ మ్యాచిక్కి వర్షం వల్ల …

Read More »

వైస్ కెప్టెన్ గా బుమ్రా

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తారని అస్సలు ఊహించలేదని భారత మాజీ సెలెక్టర్, వికెట్ కీపర్ సబా కరీమ్ అన్నాడు. ‘ఈ విషయం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాను. అతడు మల్టీ ఫార్మాట్ ప్లేయర్. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ అద్భుతంగా రాణించాడు. పంత్కి కెప్టెన్సీపై అవగాహన ఉంది’ అని కరీమ్ …

Read More »

మహ్మద్‌ సిరాజ్‌ కి గవాస్కర్ చురకలు

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ ఐదోరోజు ఆటలో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రవర్తించిన తీరును బ్యాటింగ్‌ దిగ్గజం గవాస్కర్‌ తప్పుపట్టాడు. సౌతాఫ్రికా వైస్‌ కెప్టెన్‌ బవుమా పరుగు కోసం ప్రయత్నించకున్నా..సిరాజ్‌ అతడివైపు బంతి విసరడమేమిటని సన్నీ ప్రశ్నించాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో డిఫెన్సివ్‌గా ఆడిన బవుమా పరుగుకోసం ప్రయత్నించకున్నా.. ఫాలో అప్‌లో బంతిని అందుకున్న భారత పేసర్‌ దానిని బవుమాపైకి విసిరాడు. దాంతో బంతి ఎడమ పాదానికి తగిలి సౌతాఫ్రికా బ్యాటర్‌ …

Read More »

భారత్ 174 రన్స్ కి ఆలౌట్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు 2వ ఇన్నింగ్సులో భారత్ 174 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. పంత్ (34), KL రాహుల్(23), రహానే (18) తప్ప మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, మార్కో చెరు 4 వికెట్లు తీయగా.. ఎంగిడికి 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ 304 రన్స్ ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్లో గెలవాలంటే సౌతాఫ్రికా 305 …

Read More »

భారత ఓపెనర్ రాహుల్ మరో రికార్డు

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2007లో వసీమ్ జాఫర్ కేప్ టౌన్లో సెంచరీ బాదాడు. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat