బీసీసీఐ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కోల్ కత్తాలో భారీ బంగ్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 10,280 చదరపు అడుగులు కలిగిన ఈ బంగ్లాను భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత పూర్వీకుల ఇంటి నుంచి గంగూలీ త్వరలోనే కొత్తగా కొన్న భవనంలోకి మారనున్నాడు.
Read More »టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్
టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటిస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తాను సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని దాదా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదన్నారు. 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరవ్ గంగూలీ సూచించారు.
Read More »మరో ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ (5,065) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. ధోనీ (4,520), రాహుల్ ద్రావిడ్ (3,998), సౌరభ్ గంగూలీ(3,468) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు
సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
Read More »గంగూలీ ఫ్యామిలీకి కరోనా
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఫ్యామిలీకి కరోనా సోకింది. ఆయన కుటుంబంలో నలుగురికి పాజిటివ్ గా తేలింది. వీరిలో అతని కూతురు కూడా ఉంది. అయితే వీరందరికీ తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల అందరినీ హోం ఐసోలేషన్ లోనే ఉంచారు. గంగూలీ భార్య మాత్రం నెగటివ్ వచ్చింది. ఇప్పటికే గంగూలీకి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
Read More »దాదాకు డెల్టా ప్లస్ కరోనా
టీమిండియా లెజండ్రీ ఆటగాడు,బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని వైద్యులు తెలిపారు. 2 రోజుల కిందట సేకరించిన శాంపిల్స్లో దాదాకు తాజాగా డెల్టా ప్లస్ నిర్ధారణ అయ్యింది. కాగా.. కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజులుగా దాదా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాడు. గంగూలీని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Read More »కోలుకుంటున్న దాదా
ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.
Read More »వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments
టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.
Read More »వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.
Read More »టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వయసున్న ద్రవిడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్రవిడ్ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీమిండియా కోచ్‌గా వ్యవహరించేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేనప్పటికీ, ఆయనతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ …
Read More »