ఏపీలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గంలోని తన నివాసంలో ఉండగా గుండెనొప్పి రావడంతో వైద్యులను పిలిపించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా గుండెలోని వాల్వ్ బ్లాక్ కావడంతో చికిత్స అందించారు.
Read More »వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికపై మంత్రి జయరాం క్లారిటీ
ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ప్రధానప్రతిపక్షమైన టీడీపీలో చేరే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికల్లోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుల సంతలో కొన్నట్టు కొనడం ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »ఏప్రిల్ 3న వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. 2024 ఎన్నికలకు సంబంధించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు సార్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read More »అజ్ఞాతంలోకి వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో నిన్న శుక్రవారం ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు.. ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ ఒక స్థానంలో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేశారనే ఆరోపణలతో ఆ పార్టీ నుంచి సస్పెన్సన్ కు గురైన తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతంలో వెళ్లిపోయారు. సస్పెన్షన్ తర్వాత ఎలాంటి స్పందన తెలియజేయని ఆమె.. …
Read More »నియోజకవర్గాల పునర్విభజనపై మోదీ సర్కారు క్లారిటీ
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం 2026 సంవత్సరం అనంతరం జనాభా లెక్కలు పూర్తయిన తరువాతే నియోజకవర్గాల పునర్విభజన జరపవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉండదని ఆయన స్పష్టం …
Read More »మార్చి 29న ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభ
ఏపీలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవ సభను ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ తెలంగాణ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల …
Read More »ఏపీ మండలిలో బలం పెంచుకున్న వైసీపీ
ఏపీలో నిన్న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు స్థానాలు.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. తాజాగా జరిగిన స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ బలం భారీగా పెరిగి 44కు(గవర్నర్ కోటాతో కలిపి) చేరనుంది. ప్రధానప్రతిపక్షమైన టీడీపీ సభ్యుల సంఖ్య 17 …
Read More »ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు- ఓటు హక్కు వినియోగించుకున్న 130 మంది ఎమ్మెల్యేలు
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ హాలులో కొనసాగుతోంది. వైసీపీ అధినేత.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం సహా ఇప్పటి వరకు 130 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మరోవైపు ప్రధానప్రతిపక్షమైన టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాసేపట్లో ఓటు వేయనున్నారు. మొత్తం 7 ఎమ్మెల్సీల స్థానాలకు …
Read More »వైసీపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే
ఏపీలో అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైసీపీపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైసీపీకి దూరంగానే ఉన్నానని తెలిపారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననేది ముందుగా చెప్పను. ఓటు గురించి టీడీపీ, వైసీపీ వాళ్లు నాతో మాట్లాడలేదు’ …
Read More »వైసీపీకి చుక్కలు చూపిస్తాం -మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దొంగ హామీలు ఇచ్చారు.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి …
Read More »