దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోలిపేట చిత్రపటానికి ఎంపీ, సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుటుంబీకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన సోలిపేట రామలింగారెడ్డి …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్
తెలంగాణలో ఈ రోజు విడుదలవుతున్నదుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కచ్చితంగా దుబ్బాక టీఆర్ఎస్‌దేనని అధిష్టానం, స్థానిక నేతలు భావించారు. అంతేకాదు.. మంత్రి హరీష్ రావు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా దగ్గరుండి మరీ చూసుకున్నారు. అయితే ఫలితాలకు వచ్చేసరికి పూర్తిగా తారుమారైంది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో తప్ప టీఆర్ఎస్.. రౌండ్లలో మాత్రం ఎక్కడా ఆధిక్యత చూపలేదు. ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. …
Read More »దుబ్బాకలో 82.61% పోలింగ్ నమోదు
దుబ్బాక ఉపఎన్నికలో 82.61% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 86.24% ఓట్లు పోలవగా.. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఇక బీహార్ లో 94 స్థానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో 53.51% ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ తుదివిడత ఎన్నికలు ఈనెల 7న జరగనుండగా.. ఈ ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 10న లెక్కించనున్నారు..
Read More »దుబ్బాకలో 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను సిబ్బంది ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. లచ్చపేటలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
Read More »బీజేపీపై మంత్రి హారీష్ ఫైర్
బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం నిధులున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఏది నిజమో.. ఏది అబద్ధమో దుబ్బాక ప్రజలు ఆలోచించాలని, తప్పుడు ప్రచారాలని నమ్మి మోసపోతే గోస పడతామని అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు, మేధావులకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతల అబద్ధాలపై …
Read More »బిజెపి నుండి టిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో అల్వాల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దిలీప్, నమిలే రవి, ధర్మారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ దళిత మోర్చా రాష్ట్ర కన్వీనర్ మందారం ఎల్లయ్య ఆధ్వర్యంలో సుమారుగా 150 తోపాటు కొంతమంది యువకులు భారీగా మంత్రి హరీష్ రావ్ ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ …
Read More »సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో..
దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన పర్షరాములు సోలిపేట రామలింగన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత సోలిపేట సుజాతక్క మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ చేతుల మీదుగా పరుశురాం యాదవ్ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ఆడియో సీడీ క్యాసెట్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి …
Read More »దుబ్బాకలో రూ.104.09 కోట్లతో విద్యుత్ పనులు
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విద్యుత్ జిగేల్‌మంటున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయించారు. ఈ ఆరేండ్లలో సుమారు రూ.104.09 కోట్ల విద్యుత్ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అప్పనపల్లి, రామసముద్రం, రామక్కపేట, తిమ్మాపూర్, బొప్పాపూర్, కాసులాబాద్, జప్తిలింగారెడ్డిపల్లి, గొడుగుపల్లి, మాచిన్‌పల్లి, అనాజీపూర్, కాసన్‌పల్లి, అనంతసాగర్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లను 14 కొత్త …
Read More »యువకులే టీఆర్ఎస్ సైనికులు..
విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు టీఆరెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ , అదేవిధంగా రాయ్ పోల్ మండలం అనాజ్ పూర్, తిమ్మక్క పల్లి చెందిన బీజేపీ యువకులు పెద్ద సంఖ్యలో శనివారం టీఆరెస్ పార్టీలో చేరారు. వీరిని మంత్రి హరీష్ రావు గారు గులాబీ కండువలతో ఆహ్వానించారు. ఈ …
Read More »ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవు
దుబ్బాకలో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నిక ముగిశాక మళ్లీ కనిపించరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పెద్ద పెద్ద కార్లు, సూట్‌కేసులతో వస్తున్నారని, కానీ.. ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు మాత్రమే మిగిలారని, కార్యకర్తలంతా ఎప్పుడో ఖాళీ అయ్యారని, నాయకులకు తోవ చూపించేవారు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత, 2008 ఉప …
Read More »