తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ శనివారం మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, అన్నాదురైల స్మారక కేంద్రాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరగబోతున్న తరుణంలో ఆమె ఈ నేతలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. తాను రాజకీయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని ఆమె మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని …
Read More »రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు
తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం,అన్నాడీఎంకే అధినేత జయలలిత స్నేహితురాలు.. ఆ పార్టీ నేత శశికళ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. శశికళకు చెందిన సుమారు మొత్తం రూ.1600 కోట్ల విలువ చేసే ఆస్తులను పది కంపెనీల్లో సోదాలు నిర్వహించి బినామీ చట్టం కింద అటాచ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గత రెండేళ్ళుగా బెంగుళూరులోని అగ్రహారం జైలులో శశికళ శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే
Read More »