తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఉప్పల్ నుంచి నేరుగా యశోద ఆస్పత్రికి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ …
Read More »జంటనగరాల్లో వైభవంగా బోనాల వేడుకలు
జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు. ఈసారి వైరస్ ఉధృతి కాస్త …
Read More »తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుండి ఆహార భద్రత కొత్త కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని సీఆర్‌ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. మొదటి విడతలో …
Read More »బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 కోట్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించిందని, అదేవిధంగా ఆలయాల్లో పూజలు, అలంకరణ కోసం ప్రత్యేకంగా రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిరహించేందుకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 3లక్షల మందికి సరిపడా మాస్క్‌లు, శానిటైజర్లు …
Read More »పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు
మురికివాడల స్థానంలో పేదలకు ఆత్మగౌరవంతో జీవించే ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సీఎం కేసీఆర్ కల సాకారమైందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని పొట్టి శ్రీరాములు నగర్ బస్తీ లో కార్పొరేటర్ కే.హేమలత, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారీ, తాసీల్దార్ బాలశంకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌసింగ్ ఈఈ ఎం.వెంకట్‌దాస్‌రెడ్డి, జలమండలి …
Read More »రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి బయట మల్కాజీగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కరోనా బాధితుల వెంట వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 1,000 మంది కడుపు నింపుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికీ అన్నం పెడతామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో …
Read More »పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని …
Read More »సికింద్రాబాద్‌లో తప్పిన అగ్నిప్రమాదం
హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్‌పేట్ చౌరస్తాలో ఉన్న జబ్బార్ కాంప్లెక్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న సరుకు అంతా కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలిపారు.
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు
కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Read More »ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్
ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది
Read More »