దేశంలో బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More »క్రాస్ అయిన ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్
రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.
Read More »రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం
రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.
Read More »రూ.2వేల నోట్ల రద్ధుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం..?
గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …
Read More »రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త
రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్లపై వడ్డీరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాదికి 8.5% వడ్డీ రేటుతో గృహరుణాలు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. MSME రుణాలు కూడా 8.4% వడ్డీకే ఇస్తామని పేర్కొంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని BOB వివరించింది.
Read More »బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు
5 రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్ల కోసం జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ఈనెల 26న రిపబ్లిక్ డే, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం ఉండటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు తెరుచుకోవు. 26 నుంచి 31 మధ్య కేవలం …
Read More »ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఎస్బీఐ పాస్ బుక్ -ఎందుకంటే..?
ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ పాస్ బుక్ గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అయిన ట్విట్టర్ వేదికగా వేలాదిగా ట్వీట్లు వస్తున్నాయి. అయితే, SBI పాస్ బుక్ ను అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో పోల్చుతూ చేస్తోన్న ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే? SBI పాస్ బుక్, అర్జెంటీనా దేశ జెండా రంగు ఒకేవిధంగా ఉంటాయి. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు FIFA వరల్డ్ కప్ 2022 …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు సంబంధించి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్ సర్కిల్‌లో 175 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. డిగ్రీ పూర్లయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »SBI ఖాతాదారులకు శుభవార్త
మరో ఓ గుడ్‌న్యూస్‌తో ఖాతాదారుల ముందుకొచ్చింది SBI. ఇందులో భాగంగా తమ ఖాతాదారులు వినియోగించే మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ పై ఎస్ఎంఎస్ ఛార్జీలను రద్దు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే యూఎస్ఎస్‌డీ సర్వీసులను పొందొచ్చని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ వేదికగా నిన్న ఆదివారం ఎస్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ఫీచర్ ఫోన్లు వాడుతున్నవారికి ఉపశమనం కలిగించనుంది. ‘‘మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీ చేస్తున్నామని …
Read More »భారీ డిస్కౌంట్స్‌తో రానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. …
Read More »