తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో దళితబంధు కింద 43 మందికి ట్రాక్టర్లు, ఐదుగురికి కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట వేసిందన్నారు. ఐనోల్ గ్రామంలో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను ఇంటర్‌గా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు అదనపు భవనానికి రూ.4 …
Read More »కె.శాంతాకుమారికి మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
ఈ ఏడాది జూన్ 6 నుండి 13 తేదీలలో థాయిలాండ్ లో జరిగిన 14వ ఆసియా వాలీబాల్ మహిళల అండర్ 18 గెటగిరి చాంపియన్ షిప్ లో భారతజట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన కె.శాంతాకుమారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుని, అండర్ 18 కేటగిరి వాలీబాల్ భారత …
Read More »ఓరుగల్లులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని భగవంతుని కరుణ, కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ధర్మో రక్షతి రక్షితః అని నమ్మిన శ్రీరామచంద్రుడు.. ధర్మం కోసం నిలబడిన మహా పురుషుడని, అలాంటి రామయ్య కల్యాణ మహోత్సవాలను భద్రాచలంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చినతర్వాత పండుగలకు ప్రాశస్త్యం పెరిగిందన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్.. రామ రాజ్యంగా …
Read More »సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలి – మంత్రి సత్యవతి రాథోడ్
సబ్బండవర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు. ఆయన కలలను నిజం చేయడంలో మనమంతా వారధులుగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి. సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో …
Read More »కళ్యాణ లక్ష్మీకి ప్రేరణ అయిన కల్పన కూతురు చంద్రకళ పెళ్లికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన బిడ్డ కల్పన ప్రేరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం 10 లక్షల మంది ఆడ పిల్లల జీవితాలలో వెలుగులు నింపింది అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలతో …
Read More »మంత్రి సత్యవతి రాథోడ్ ను కల్సిన ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం
మహిళల గౌరవం కాపాడే విధంగా మరిన్ని చట్టాలను తీసుకురావాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం నేడు మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి విజ్ణప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి, కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ కి మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు
హరిత ప్రేమికుడు, మొక్కలంటే అమితమైన మక్కువ చూపే నేత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ఖండంతారాలకు తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పచ్చదనం గొప్పదనాన్ని చాటుతున్న రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతిరాథోడ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు వారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా క్షేమం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం …
Read More »బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు
బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని అంటారని, ఈ కారణంతో మంచి నూనె ధరను కూడా లీటరుకు 300 రూపాయల వరకు పెంచుతారని ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్లు, ఇంటి అనుమతుల …
Read More »తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి
సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు.ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన …
Read More »