సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళనల్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ ఉద్యోగార్థి దామెర రాకేష్ అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ జిల్లా దబీర్‌పేట స్మశానంలో రాకేష్ మృతదేహానికి ఆయన తండ్రి కుమారస్వామి నిప్పంటించారు. అంతకుముందు నర్సంపేట చేరుకున్న రాకేష్ మృతదేహానికి పెద్ద ఎత్తున ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆ తర్వాత అతడి స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, …
Read More »బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది- మంత్రి సత్యవతి రాథోడ్
దేశంలో గిరిజనులు, దళితులకు మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ములుగులో ట్రైబల్ వర్సిటీని ఇంతవరకు కేంద్రం నిర్మించలేదని తెలిపారు. పోడు భూముల సమస్యపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
Read More »డాక్టర్ల కృషి మరువలేనిది
కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించడంలో డాక్టర్ల కృషి మరువలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోడ్లు, భవనాలు అతిథి గృహ ఆవరణలో డాక్టర్లకు అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు. అందులోనూ …
Read More »త్వరలోనే పోడు భూములకు పరిష్కారం
ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అటవీ భూముల సర్వేను చేపట్టడంతో పాటు.. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామన్నారు. …
Read More »లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 53లక్షల రేషన్‌కార్డులు జారీ చేసి చేతులెత్తివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 34లక్షల కార్డులు జారీ చేసిందని తెలిపారు. రేషన్ షాపులకు దూరంగా ఉన్న గ్రామాలకు సబ్ సెంటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ …
Read More »దళితులందరికీ దళిత క్రాంతి పథకం ఫలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముందు చూపు వల్ల ఈ రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, తద్వారా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు ఏడవ విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణం, ఒడితెల, …
Read More »GWMC ఎన్నికలు-అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్లకు గానూ తొలి జాబితాలో 18 డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. తొలి జాబితా అభ్యర్థులకు బీ ఫారాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. 2వ డివిజన్ – బానోతు కల్పన సింగులాల్ 5వ …
Read More »ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు
తెలంగాణ రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుదలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇది కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారానే సాధ్యమయ్యిందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ఏరియా దవాఖానలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 46 కేంద్రాల ద్వారా సుమారు 75 వేల మందికి పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలంటే …
Read More »దేశంలో తొలిసారిగా తెలంగాణ గిరిజన సైనిక్ స్కూల్
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల సిగలో ఒక్కొక్క పువ్వుగా రోజుకో విద్యా సంస్థ కొత్తగా వచ్చి చేరుతుంది. గిరిజన శాఖను మరింత వికసింపజేస్తున్నాయి. తెలంగాణ గిరిజన విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా, విద్యలో వారికి సమాన అవకాశాలే ధ్యేయంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ శాఖలో కొత్తగా పలు విద్యా సంస్థలు మంజూరు అవుతున్నాయి. …
Read More »అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు
పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్ వాడీ కేంద్రాలలో, మినీ అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, …
Read More »