Home / Tag Archives: sammakka saralamma

Tag Archives: sammakka saralamma

ఆ ప్రచారం కరెక్ట్‌ కాదు..: చినజీయర్‌ స్వామి

విజయవాడ: కొత్తగా ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయని.. తామెప్పుడూ ఆదివాసీలు, మహిళలను చిన్నచూపు చూడలేదని  చినజీయర్‌ స్వామి అన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. చినజీయర్‌ స్వామి క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణలో పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏదైనా విషయాన్ని విన్నప్పుడు ఆ వ్యాఖ్యల ముందు వెనుక ఏం జరిగిందన్నది …

Read More »

4రోజుల మేడారం జాతరలో ఏ రోజు ఏంటి..?

గుడి లేదు.. గోపురం లేదు.. అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏమీ లేవు.. సమ్మక్కా అని నోరారా పిలిస్తే.. సక్కగ జూస్తది. సారలమ్మా అని మనసారా కొలిస్తే.. అమ్మగా దీవిస్తది. నిలువెత్తు బెల్లం సమర్పిస్తే.. తల్లీకూతుళ్లిద్దరూ బతుకంతా కొంగు బంగారమై కాపాడుతరు. జీవితాన్ని పావనం చేసే వన దేవతల రెండేండ్ల సంబురం మొదలైంది. గద్దెనెక్కి భక్తుల బతుకులను దిద్దే జనజాతరకు జయజయ ధ్వానాలు పలుకుదాం. అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల …

Read More »

వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …

Read More »

మంత్రి కేటీఆర్ కు మేడారం జాతర ఆహ్వానం

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క – సారాలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి  కె.టి.ఆర్ కి అందించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, …

Read More »

జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు

తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది మధ్య జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారనే అంచనా ఉంది. ఈ మేడారం జాతర పూర్తిగా ములుగు జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటంతో పాటు, అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగని రీతిలో అటవీ …

Read More »

ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్

ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ …

Read More »

మేడారంలో భక్తుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం జాతర వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మొదలు కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో మేడారంలో వనదేవతలు సమ్మక్క,సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ మహా మేడారం జాతర జరగనున్నది. అయితే ఆదివారం ఒక్కరోజే మొత్తం …

Read More »

మేడారంలో ప్రత్యేక ఆసుపత్రి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మేడారం మహాజాతర జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే మేడారంలో పలు ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తులకు,ప్రజలకు అవసరమైన సకల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే జాతర జరగనున్న ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మేడారంలో యాబై పడకలతో కూడిన అత్యాధునీక టెక్నాలజీ సౌకర్యాలున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat