తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చేందుకు 1,130 గెస్ట్ లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నియామకాల్లో నెట్, పీహెచ్ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం దక్కనుండగా, తర్వాతి ప్రాధాన్యం పీజీ పూర్తి చేసిన వారికి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ పేర్కొంది.
Read More »తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు. ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్ పాయింట్లు సాధించారు. రెగ్యులర్ సహా గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే …
Read More »తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతపై కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాస్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారే పాస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని సూచించారు. అది తప్పుడు వార్త అని.. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More »మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక శుభవార్తను తెలిపారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ నియామాకాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు.బుధవారం అసెంబ్లీ సబ్జెట్ సమావేశాల్లో జరిగిన పాఠశాల విద్య,ఉన్నత విద్య,సాంకేతిక విద్య పద్దులపై పలు పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన …
Read More »తెలంగాణ రాష్ర్టంలో 1201 జూనియర్ కాలేజీలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
శానసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ర్టంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్థాపనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలోని 445 మండలాల్లో విద్యాశాఖతో పాటు వివిధ సంక్షేమ శాఖలతో కలుపుకొని 1201 జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 38 ఎయిడెడ్ కాలేజీలు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూళ్లతో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మరో …
Read More »తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులకు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి తన కార్యాలయంలో ఉన్నతవిద్యా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కళాశాల తరగతులవారీగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను తరచూ తనిఖీచేయాలని సూచించారు. ప్రతిరోజు శానిటైజేషన్ …
Read More »తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి పది పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, …
Read More »ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్, రివిజన్ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని …
Read More »