రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. …
Read More »రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలి
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని ఆయన తెలిపారు. 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు సొమ్మును బాకీల కింద బ్యాంకర్లు జమ చేసుకోవద్దని సూచించారు. జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని అన్నారు. రైతులకు పెట్టుబడి …
Read More »రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలు – మంత్రి కొప్పుల
గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాఘవపట్నం, శ్రీరాముల పల్లె, వెనుగుమట్ల గ్రామాలలో రైతు వేదికలను, పల్లె ప్రకృతివనం, 13 లక్షల వ్యయం నిర్మించిన CC రోడ్లలను ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి గారు అన్నారు.రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని …
Read More »రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేయాలని, రైతును రాజు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నేడు మహబూబాద్ జిల్లా, ములుగు నియోజకవర్గం, ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కొత్తగూడ, పొగుళ్లపల్లిల్లో రైతు వేదికలను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రారంభించారు. కరోనా కష్టకాలంలోనూ రైతుకి ఇచ్చే …
Read More »తొలిరోజు రికార్డు స్థాయిలో రైతుబంధు సాయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకరా భూమి గల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. రైతుబంధు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 16,95,601 మంది రైతులకు రైతుబంధు అందింది. 10,33,915 ఎకరాలకు రూ. 516.95 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం. తొలిరోజు రైతుబంధు అందుకున్న వారిలో నల్లగొండ రైతులు ఎక్కువగా ఉండగా ఆదిలాబాద్ రైతులు తక్కువగా ఉన్నారు. నల్లగొండకు చెందిన …
Read More »CM KCR లాంటి సీఎం మాదగ్గర పుడితే బాగుండు-మహారాష్ట్ర వాసి
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని, ఇలాంటి సీఎం తమ దగ్గర ఉంటే ఎంతో బాగుండేదని మహారాష్ట్ర వాసి రోహిలే పద్మ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్‌కు చెందిన రోహలే సదాశివ్‌కు తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో 5 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇటీవల సదాశివ్ అనారోగ్యంతో మృతి చెందగా నామినీగా ఉన్న అతడి భార్య పద్మ అధికారులకు గత …
Read More »ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
తెలంగాణలో వానకాలం రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానున్నది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సీజన్‌కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందుతుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు …
Read More »రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ
తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదును జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదికి మొత్తం 63,25,695 మందిని అర్హులుగా గుర్తించామని వివరించారు. కొత్తగా 66,311 ఎకరాలకు రైతుబంధు వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. 150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు అవసరమని చెప్పారు. గతేడాది రెండు సీజన్లకు కలిపి రూ.14,656.02 కోట్లు పంపిణీ చేయగా.. …
Read More »రైతుల పాదాలు కడుగుతున్నాం : సీఎం కేసీఆర్
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే …
Read More »రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో 6,014.45 కోట్లు జమ
తెలంగాణలో యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 120.29 లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్టు మంగళవారం పేర్కొన్నారు.
Read More »